విశాఖ ఉక్కు: టీడీపీ యూటర్న్

Vizag Steel

చెప్పేదొకటి చేసేదొకటి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఘనత వహించింది. ఎన్నికల ముందు చెప్పినవి ఎన్నిక ఫలితాల తర్వాత చెయ్యకపోవడం, ప్లేట్ ఫిరాయించడం వంటి వాటిలో టీడీపీ, ఆ పార్టీ నేతలకు బాగా అలవాటు. అది మరోసారి నిరూపితం అయింది.

విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చెయ్యబోనివ్వమని ఇంతకుముందు చెప్పిన తెలుగు దేశం ప్రభుత్వం తాజాగా మాట మార్చింది.

విశాఖ స్టీల్ కి చెందిన 22 వేల ఎకరాల భూమిని ప్రైవేట్ కి ధారాదత్తం చెయ్యనివ్వమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ఇటీవల చెప్పారు. 8 వేల కోట్ల పెట్టుబడితో విశాఖ స్టీల్ కి పూర్వ వైభవం తెస్తామని ప్రకటించారు. ఐతే కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది.

పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఎన్ డీఏ ప్రభుత్వ విధానం అని తాజాగా కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. విశాఖ ఉక్కు గతేడాది కూడా 2 వేల కోట్ల నష్టం చూపింది. నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మడం లేదా పెట్టుబడులను ఉపసంహరించడం అనేది చెయ్యక తప్పదు అని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రజాధనం దుర్వినియోగం కానివ్వమని అన్నారు.

కేంద్ర మంత్రి మాటతో తెలుగుదేశం పార్టీ సైలెంట్ అయిపొయింది. ఒక్క రెండు సీట్లు ఇస్తే విశాఖ ఆస్తులను కాపాడుతాను అని ఎన్నికల ముందు ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా చప్పుడు చెయ్యడం లేదు.