Sreemukhi: శ్రీముఖికి పెళ్లి సెట్ అయ్యిందట.. వరుడెవరంటే..!

Sreemukhi

బిగ్‌బాస్‌కి వెళ్లొచ్చిన తర్వాత.. బిగ్‌బాస్‌కి ముందు చాలా మంది కెరీర్స్ తలకిందులయ్యాయి. అయితే శ్రీముఖి (Sreemukhi) కెరీర్ విషయంలో మాత్రం మార్పు లేదు. అమ్మడు ఇప్పుడు ఏ ప్రోగ్రాం చూసినా ఆ ప్రోగ్రాంలో కనిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన పెద్ద గొంతుతో సెట్‌నే హడలెత్తిస్తుంది. అయితే శ్రీముఖి పెళ్లి విషయం మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్కే.

శ్రీముఖి (Sreemukhi) పెళ్లి చేసుకోబోతోంది. పెళ్లి ముహూర్తం సెట్ అయింది… వరుడు ఎవరో కాదు.. అంటూ ఎన్నో సార్లు అమ్మడి పెళ్లి గురించి వార్తలు విన్నాం.. వింటున్నాం కూడా. తాజాగా మరోసారి శ్రీముఖి (Sreemukhi) పెళ్లి వార్త హైలైట్ అవుతోంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మడు గత కొంత కాలంగా సీక్రెట్‌గా ప్రేమ వ్యవహారాన్ని నడుపుతోందని సోషల్ మీడియా టాక్.

Advertisement
Sreemukhi

ఆమె ప్రేమించిన వ్యక్తి ఒక వ్యాపారవేత్త అని సమాచారం. ఇటీవలే వీరిద్దరూ తమ పెద్దలకు ప్రేమ వ్యవహారాన్ని చెప్పారని.. వాళ్లు కూడా వీరిద్దరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని శ్రీముఖి (Anchor Sreemukhi) తన స్నేహితులతో పంచుకుందట. అలా ఇప్పుడు మరోమారు శ్రీముఖి పెళ్లి వార్త వైరల్ అవుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో వేచి చూడాలి.