Nagarjuna: బాలయ్యపై నాగ్ రివెంజ్.. అందుకేనా లాబీయింగ్..!
టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ (Balakrishna), నాగార్జున (Nagarjuna) ఎక్కడా కలిసి కనిపించిన దాఖలాలు లేవు. ఇద్దరికీ అస్సలు పొసగదని ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు వీరిద్దరి వైరానికి సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. సంక్రాంతికి అటు బాలయ్య.. ఇటు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. నడుమ వారసుడు చిత్రాలు సందడి చేయనున్న విషయం తెలిసిందే. వారసుడికి సంబంధించిన విషయాలన్నీ దిల్ రాజు స్వయంగా చూసుకుంటున్నారు.
ఇక బాలయ్య, మెగాస్టార్ చిత్రాలకు థియేటర్ల మాటేంటి? అసలే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేనట్టుగా థియేటర్ల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో వారసుడికి ఢోకా లేదు. బాలయ్య కోసం ఇండస్ట్రీ నుంచి కొందరు.. పొలిటిక్స్ నుంచి కొందరు థియేటర్లను బ్లాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. మరి చిరు మాటేంటి? ఈ సమయంలోనే నాగ్ రంగంలోకి దిగారు. అసలే బాలయ్య అంటే పడదనే టాక్ ఉండనే ఉందిగా.
నాగార్జున(Akkineni Nagarjuna)కు డిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి పట్టుంది. ఇప్పటికే ఆయన తన సినిమాలను అన్నపూర్ణ ద్వారా సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఏపీలో సైతం నాగ్‌కు మంచి పట్టుంది. ఇక చిరు కోసం ఏపీలో తనకు పట్టున్న కృష్ణా, గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో చిరు వాల్తేరు వీరయ్య (Waltari Veerayya)కు కాస్త ఎక్కువ థియేటర్లు వచ్చేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్యతో ఎలాగూ పొసగడం లేదు కాబట్టి నాగ్ గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం.