విడాకుల వార్తలపై భర్తతో కలిసి క్లారిటీ ఇచ్చిన నటి ఇంద్రజ

విడాకుల వార్తలపై భర్తతో కలిసి క్లారిటీ ఇచ్చిన నటి ఇంద్రజ

సోషల్ మీడియా సామన్యులనైతే పట్టించుకోదు కానీ ప్రముఖులను అందునా సెలబ్రిటీలను వదిలేస్తుందా? చిన్న పాయింట్ దొరికితే చాలు నానా యాగీ చేసేసి వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు అయిన ప్రముఖ నటి ఇంద్రజకు సోషల్ మీడియా దారుణంగా దెబ్బేసింది. దళపతి విజయ్ ‘విజిల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రజ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి.. నెలక్రితం వివాహం చేసుకుంది.

ఇంద్రజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ పెళ్లయి నెల కాకముందే ఇంద్రజకు ఆమె భర్తతో వివాదాలు ప్రారంభమయ్యాయని.. అవి కాస్తా ముదరడంతో విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారం ప్రారంభమైంది. దానిని చూసి ఇంద్రరజ షాక్ అయ్యాంది. ఇక చేసేదేముంది? భర్తను వెంటబెట్టుకుని మరీ ఓ ఇంటర్వ్యూ ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చింది. 

ఇంద్రకు కార్తీక్ అనే వ్యక్తితో వివాహమైంది. అయితే పెళ్లిలో కొన్ని విషయాలు నెటిజన్లకు నచ్చలేదు. అవేంటంటే.. ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడం. వీటిపై పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో పాటు ఆమె భర్తతో కలిసి పెట్టిన ఒక పోస్ట్‌పై అసహ్యకరమైన కామెంట్స్ పెట్టారట. ఇప్పటికీ ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ ఎంతో కాలం కలిసుండలేరని.. విడాకులు తీసుకుంటారంటూ ఒక వ్యక్తి పోస్ట్ పెట్టాడట. అలా ఎలా పెడతారంటూ ఇంద్రజ తన ఆవేదనను వ్యక్తం చేసింది.