మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

మత్తుకు బానిసై నా భార్య డ్రగ్స్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది: ప్రముఖ నిర్మాత సంచలనం

ప్రముఖ కన్నడ నటుడు, సినీ నిర్మాత టి చంద్రశేఖర్(Producer Chandrasekhar) తన భార్యపై  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు చేసిన కారణం సంచలనం రేపుతోంది. తన భార్య నమిత(Namitha) మత్తు పదార్థాలకు బానిస కావడమే కాకుండా.. ఏకంగా ఆ డ్రగ్స్‌ విక్రేతతో అక్రమ సంబంధం పెట్టుకుందని చంద్రశేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. నమితను చంద్రశేఖర్ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు.

అయితే ఇటీవలి కాలంలో నమిత మత్తు పదార్థాలకు అలవాటు పడిందని.. మానేయాలని ఎంతగా మొత్తుకున్నా కూడా పట్టించుకోవడం లేదని చంద్రశేఖర్ ఆరోపిస్తున్నారు. పైగా డ్రగ్ విక్రేతతోనే అక్రమ సంబంధం పెట్టుకుందని వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె స్నేహితుడు, పేరు మోసిన డ్రగ్ డీలర్ లక్ష్మీశ్‌ ప్రభులపై బెంగళూరు చెన్నమ్మనకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇటీవల ఇంటిలో ఇద్దరూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ప్రశ్నిస్తే తన పైనే దాడి చేశారని చంద్రశేఖర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆయన భార్య నమిత మాత్రం మరోలా చెబుతున్నారు. తనపై చంద్రశేఖర్ మోపిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొట్టిపడేస్తూ రివర్స్‌లో చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేశారు. తన స్నేహితులతో కలిసి అరుణ్, హేమంత్‌లు తనపై చాకుతో దాడి చేశారని.. అంతేకాకుండా ఇంట్లో డ్రగ్స్ పెట్టి అరెస్ట్ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని నమిత తన ఫిర్యాదులో పేర్కొన్నారు.