Allu Arjun: పౌరాణిక సినిమాలో అల్లు అర్జున్.. బాలీవుడ్ వెయిటింగ్ అట..

Allu Arjun: పౌరాణిక సినిమాలో అల్లు అర్జున్.. బాలీవుడ్ వెయిటింగ్ అట..

ఒకరకంగా మిగిలిన స్టార్స్‌తో పోలిస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సమ్ థింగ్ స్పెషల్. ఏ నటుడికి దక్కని క్రేజ్ కేరళలో బన్నీకి దక్కింది. అక్కడ ఆయన్ను మల్లు అర్జున్ అంటారంతా. ఇక పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఏకంగా పాన్ ఇండియా స్థాయికి ఎగిశాడు. ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్స్ బన్నీ కోసం వెయిట్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. పుష్ప సెకండ్ పార్ట్ పూర్తవగానే బాలీవుడ్‌లో సినిమా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవలి కాలంలో బన్నీ(Allu Arjun) ఎక్కువగా ముంబైకి ట్రిప్ వేస్తున్నాడు. ఈక్రమంలోనే తాజాగా సంజయ్ లీలా బన్సాలీ(Sanjay Leela Bansali)ని కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆయనతో కలిసి సినిమా చేయబోతున్నాడని చర్చ జరుగుతోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో బన్నీ సినిమా చేయబోతున్నాడట. మహాభారతంలోని అశ్వత్థామ క్యారెక్టర్ ఆధారంగా ఈసినిమా తెరకెక్కబోతోందని సమాచారం.

Advertisement
Allu Arjun: పౌరాణిక సినిమాలో అల్లు అర్జున్.. బాలీవుడ్ వెయిటింగ్ అట..

ఆదిత్య ధార్, బన్నీ(Allu Arjun) కాంబొలో రూపొందనున్న మూవీకి ది ఇమ్మోర్టల్‌ అశ్వత్థామ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారని టాక్. మొత్తానికి మన ఐకాన్ స్టార్ దేశ వ్యాప్తంగా దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం త్వరలోనే రానుందని ప్రచారం జరుగుతోంది. ఇక పుష్ప(Pushpa) సినిమా తర్వాత వరుస సినిమాలను బన్నీ(Allu Arjun) లైన్‌లో పెడుతున్నాడు. వాటిలో ఒకటి అర్జున్ రెడ్డి(Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga)తో సినిమా అని తెలుస్తోంది.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!