‘భోళా శంకర్’ చిత్రానికి షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రేపు విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి నేడు ప్రకటన వెలువడింది. ఏపీలో టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీనికి కారణం కూడా తెలిపింది. టికెట్ల ధరలను పెంచాలంటే ఏపీ ప్రభుత‍్వం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును ఆ చిత్ర నిర్మాతలు సమర్పించాల్సి ఉంది.
అయితే ఆ డాక్యుమెంట్లను సమర్పించనందునే టికెట్ల ధరలు పెంచేందుకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించి చిత్ర యూనిట్‌కి షాక్ ఇచ్చింది. భోళాశంకర్ చిత్రాన్ని 101 కోట్లతో నిర్మించామని నిర్మాతలు పేర్కొన్నారు కానీ దానికి అవసరమైన పత్రాలను మాత్రం నిర్మాతలు సమర్పించలేదట. అలాగే ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు ఆధారాలను సైతం సమర్పించలేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
అలాగే డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికంతో పాటు.. సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన దానికి సంబంధించిన ఆధారాలను దరఖాస్తుతో చిత్ర నిర్మాతలు జత చేయలేదట. ఈ కారణాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టికెట్ ధరల పెంపునకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ ఓకే అయితే ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది.
ఇవీ చదవండి:
జైలర్ రివ్యూ: టాక్ ఎలా ఉందో తెలుసా..?
ఆ హీరోయిన్‌తో త్వరలోనే విశాల్ పెళ్లి..!
భోళా శంకర్ విడుదల కష్టమేనా? విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన డిస్ట్రిబ్యూటర్
బిగ్‌బాస్ హౌస్‌లో ఆ తల్లీకూతుళ్లు.. ఇక రచ్చ రచ్చే..
రజినీ కంటే దాదాపు మూడింతలు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?