‘బేబి’ తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా ?

'బేబి' తొలిరోజు కలెక్షన్స్‌ ఎంతో తెలుసా ?

యూత్‌కి ఇటీవలి కాలంలో బాగా కనెక్ట్ అయిన మూవీ ‘బేబీ’. టీనేజ్ లవ్ స్టోరీ కాస్త ఎలాంటి టర్న్ తీసుకుందనేది ఈ చిత్రంలో చూపించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ చిత్రం నిన్న విడుదలై మాంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా రిలీజ్‌కి ముందు వచ్చిన అప్‌డేట్స్ అన్నీ అంచనాలను అమాంతం పెంచేశాయి. సినిమా కూడా అంచనాలకు ఏమాత్రం తీసిపోలేదు.

తొలి షోతోనే ‘బేబి’ హిట్ టాక్‌ను సంపాదించుకుంది. దీంతో అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ‘ఏజెంట్’ సినిమాతో నష్టపోయిందంతా నిర్మాత ఈ సినిమాతోనే రాబట్టుకునేలా ఉన్నారు పరిస్థితులు చూస్తుంటే. ఇక తొలిరోజు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టుకుంది? ప్రి రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది? బ్రేక్ ఈవెన్‌కు ఇంకెంత దూరంలో ఉంది? వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి. 

Advertisement
Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి రూ.6 కోట్లకు జరిగినట్టుగా తెలుస్తోంది. యూఎస్‌లో ఈ చిత్రం కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూలు చేయగా.. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 3 నుంచి 4 కోట్ల రూపాయల షేర్‌ను సొంతం చేసుకుంది. అయితే ఎందుకోగానీ.. ఈ చిత్రం కోస్తా, సీడెడ్‌లో నూన్ షోస్‌తో పోలిస్తే మ్యాట్నీ కలెక్షన్స్ బాగా పడిపోయాయి. మొత్తంగా ఈ చిత్రం రూ.5 కోట్లు వసూలు చేసింది. దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైనట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Baby Review: ‘బేబి’ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతోందట.. ఓవరాల్ టాక్ ఏంటంటే..

Klin Kaara: మెగా వారసురాలు క్లీంకార రూం చూస్తే షాక్ అవుతారు!

Hi Nanna: ‘హాయ్ నాన్న’లో నాని కూతురుగా నటిస్తున్న ఈ పాప ఎవరో తెలుసా?

ప్రశాంత్ నీల్, చిరు, రామ్ చరణ్.. ఇంట్రస్టింగ్ అప్‌డేట్

సమంత గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమే.. ఆమె హెయిర్ స్టైలిస్ట్ ఎమోషనల్ పోస్ట్

విజయ్ దేవరకొండ – అనసూయల మధ్య వార్‌పై ఆనంద్ దేవరకొండ