కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకుడిగా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో తెరకెక్కిన సినిమా కల్కి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ అభిమానుల ముందుకు రాబోతోంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వీరాభిమానులు, సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనడానికి ఏ మాత్రం సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ఇతిహాసాలతో ముడిపడిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ కావడం, భారీ తారాగణం ఉండటంతో కచ్చితంగా తక్కువలో తక్కువ వెయ్యి నుంచి మూడు వేల కోట్ల రాబడుతుందని అంచనాలు వేస్తున్నారు మేకర్స్.

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

సీనియర్లు సింపేస్తారా..!

ఇక సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె, దిశా పటానీ, సీనియర్లు రాజేంద్ర ప్రసాద్‌, శోభన, మాళవిక నాయర్‌ లు కీలక పాత్రల్లో నటించారు. ఇక అతిథి పాత్రల్లో మరికొందరు నటిస్తున్నారు. దీనిపై మరికొన్ని గంటల్లో క్లారిటీ రానుంది. ఈ తారాగణం బట్టి చూస్తే కచ్చితంగా ఊహించని రీతిలో సినిమా ఉంటుందని సినీ ప్రియులు.. క్రిటిక్స్ సైతం చెబుతున్న పరిస్థితి. సీనియర్లు అంతా సినిమా సింపేస్తారని అభిమానులు చెబుతున్నారు.

కల్కి రిలీజ్ ముందు అదిరిపోయే అప్డేట్..!

మరో ఇద్దరు యంగర్స్..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. సినిమాలో మరో ఇద్దరు యంగ్ హీరోలు నటించారని ఇన్‌స్టా వేదికగా నాగ్ అశ్విన్, డార్లింగ్ ప్రభాస్ చెప్పారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఇద్దరూ కల్కిలో నటించారని రిలీజ్ ముందు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ విషయం స్వయంగా ఇద్దరూ చెప్పడంతో యంగ్ హీరోల అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దీనికి తోడు క్లైమాక్స్ లో సర్ప్రైజ్ సాంగ్ ఉంటుందని.. రెండ్ పార్ట్ 80 పర్సెంట్  యాక్షన్ ఉంటుందని నాగ్ అశ్విన్ చెప్పకనే చెప్పాడు. ఇక ప్రభాస్ పాత్ర సినిమా విడుదల అయిన 20 నుంచి 22 నిమిషాల తర్వాత వస్తుందని.. ఇది బెస్ట్ ఎంట్రీ సీన్ అని కూడా నాగి చెప్పాడు. దీంతో సినిమాపై మరింత ఉత్కంఠ, అంతకు మించి అసక్తి అభిమానులు, సినీ ప్రియుల్లో పెరిగిపోయింది. సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.