చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఒకసారి ఒకరు ఒక సినిమా సీక్వెల్ చేసి దెబ్బతిన్నారంటే.. అదే సీక్వెల్‌ను మరోసారి చేయాలంటే గట్స్ ఉండాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటంటారా? చంద్రముఖి. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్. రజినీకాంత్, జ్యోతికల నటన ఈ సినిమాకు హైలైట్. దీనికి విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నాగవల్లి అనే టైటిల్‌తో సీక్వెల్ రూపొందింది. ఇది డిజాస్టర్. తాజాగా ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ సీక్వెల్ చేసి సంచలనం సృష్టించాడు.  

ఈ సీక్వెల్‌ను కూడా ఒరిజనల్‌ను తెరక్కించిన దర్శకుడు పి. వాసుయే డైరెక్ట్ చేయగా.. రజినీకాంత్ పాత్రలో లారెన్స్.. జ్యోతిక పాత్రలో కంగనా రనౌత్ చేశారు. ఈ చిత్రం రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి ముందే ప్రీమియర్స్ చూసిన ప్రముఖులు తమ రివ్యూ ఇస్తున్నారు. నిజానికి రజినీతో మరో నటుడిని కంపేర్ చేయగలమా? రజినీని అనుకరించకుండా తన మార్క్ క్రియేట్ చేసేందుకు లారెన్స్ ట్రై చేశారట కానీ వర్కవుట్ కాలేదంటున్నారు.

చంద్రముఖి 2.. టాక్ వచ్చేసింది..

ఇక చంద్రముఖి పాత్ర చేసిన కంగనాకైతే మంచి మార్కులే పడుతున్నాయి. అయితే జ్యోతిక స్థాయిలో మాత్రం కంగనా భయపెట్టలేకపోయిందట. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. ఇక కీరవాణి సంగీతం అంటే ప్రత్యేకంగా చెప్పాలా? అందునా ఇలాంటి సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోరే ప్రధానం. కీరవాణి ఇరగదీశారట. మొత్తంగా ఒరిజినల్‌తో పోల్చుకుంటే చంద్రముఖి 2ని ఎంజాయ్ చేయలేము కానీ మామూలుగా చూస్తే మాత్రం కాస్త బెటర్‌గానే ఉందంటున్నారు.

ఇవీ చదవండి:

ఎన్టీఆర్, ప్రియమణి.. ఇదేం ట్విస్ట్?

Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌కి బాగానే జ్ఞానోదయమైంది.. రతిక అక్క అంటూ..

ఏకంగా ప్రభాస్‌ రూపునే మార్చేశారు.. ఫ్యాన్స్ ఫైర్..

బ్లాక్ కలర్ శారీలో మెరిసిపోయిన అనసూయ.. అందరి ఫోకస్ ఆమెపైనే..

వామ్మో రతిక.. బీభత్సంగా ట్రోల్స్

కేజీఎఫ్‌ తర్వాత యశ్ మరో సినిమా చేయకపోవడానికి కారణమేంటంటే..

వెంకటేష్‌తో సౌందర్య రిలేషన్‌లో ఉందంటూ రూమర్స్.. దానికి ఆమె ఎలా చెక్ పెట్టారంటే..

బిగ్‌బాస్ నుంచి వరుసబెట్టి అమ్మాయిలు అవుట్..