మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

మెగాస్టార్ పక్కన దేవకన్యలా దీపికా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది పక్కాగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్‌లో రూపొందుతోంది. అయితే ఈ సినిమాలో ఒక దేవకన్య పాత్ర ఉందని సమాచారం. కేవలం 10 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకి హైలైట్‌గా నిలుస్తుందని టాక్ నడుస్తోంది. కాబట్టి ఈ పాత్రలో స్టార్ హీరోయిన్‌ను పెట్టాలని భావిస్తున్నారు. ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది కూడా ఇప్పటికే మేకర్స్ ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె దేవకన్య పాత్రలో నటించనుందట.

ఇప్పటికే చిత్ర యూనిట్ దీపికాతో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. అయితే దీపిక అంగీకరించిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. అలాగే చిరంజీవి సరసన ఛాన్స్ అంటే దీపిక వదులుకునే అవకాశమే లేదంటున్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ చేస్తే ఆమె రేంజే మారిపోయే అవకాశం లేకపోలేదు. మొత్తానికి ఈ వార్త విని చిరు ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు. 

Google News