నా కడుపుకి ప్రభాసే కారణం.. షాకిచ్చిన దీపిక

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ. నాఘ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ  చిత్రం రూపొందింది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ తాజాగా ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్‌తోపాటు ప్రభాస్, దీపిక పదుకొన్ హాజరయ్యారు. 

ఈ ఈవెంట్‌కు రానా దగ్గుబాటి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అశ్వినీదత్, ప్రియాంక దత్, స్వప్న దత్ సైతం పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఆద్యంతం ఆకట్టుకుంది. . ఇక ఈ ఈవెంట్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ప్రభాస్‏ను అయితే ఓ ఆట ఆడుకున్నారు. అసలు స్టేజ్ పైకి వస్తూ వస్తూనే రానాపై పంచులు వేస్తూ నవ్వులు పూయించి ప్రతి ఒక్కరినీ అమితాబ్ ఆకట్టుకున్నారు.

నా కడుపుకి ప్రభాసే కారణం.. షాకిచ్చిన దీపిక

ఇక దీపిక పదుకోన్ మాట్లాడుతూ.. తనకు కడుపు వచ్చిందంటే.. ప్రభాసే కారణమని చెప్పి షాక్ ఇచ్చారు. అసలే దీపిక ప్రెగ్నెంట్‌తో ఉందన్న విషయం అందరికీ ముందే తెలుసు. దీపిక ఈ మాట అనడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ప్రభాస్ పెట్టిన ఫుడ్ తిని తనకు కడుపు వచ్చిందని తేల్చేసరికి అంతా కూల్ అయ్యారు. సెట్‌లో ఆయన అంతగా అందరికి భోజనాలు పెట్టి ఆతిథ్యం ఇచ్చేవారని.. ఆయన కోసం ఒక కేటరింగ్ టీమ్ ఉండేదని దీపిక చెప్పుకొచ్చింది.