VV Vinayak: తప్పులో కాలేసిన వీవీ వినాయక్.. రూ.100 కోట్ల సినిమాకు వసూళ్లు ఎంతొచ్చాయో తెలిస్తే..
లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి జనాలు బాగా ఓటీటీకి అలవాటు పడ్డారు. అప్పటి నుంచి థియేటర్స్‌కి వెళ్లే పరిస్థితి పెద్దగా లేదు. స్టార్ హీరోల సినిమాలు అయితేనో లేదంటే.. థియేటర్స్‌లో మాత్రమే చూడాల్సిన కొన్ని సినిమాలుంటాయి. వాటి కోసమో తప్ప జనాలు థియేటర్స్ వైపు పెద్దగా చూడటం లేదు. ఈ తరుణంలో జనాలను థియేటర్స్‌కు రప్పించాలంటే దర్శకుడు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఓ రేంజ్‌లో జనాలను మెప్పిస్తే తప్ప వారు రారు.
అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. కానీ వీవీ వినాయక్‌కు మాత్రం ఇవేమీ పట్టలేదు. ఛత్రపతి(Chatrapathi) మూవీ హిందీ డబ్ అయ్యింది. ఈ సినిమాకు వ్యూస్ మోత మోగాయి. అంతేకాదు.. టీవీలో ప్రసారమైతే కూడా ఈ సినిమాకు అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. అలాంటి సినిమాను తిరిగి హిందీలో చేసే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ మన వీవీ వినాయక్ చేశారు. ఛత్రపతి(Chatrapathi) సినిమాను బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి రీమేక్ చేశారు. వంద కోట్ల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఇక ఈ రీమేక్‌కు ఆడియన్స్ నుంచి స్పందన కరువైంది. ఫస్ట్ రోజు మాత్రం ఈ సినిమకు రూ.40 లక్షల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక అంతే.. ఆ తరువాత వసూళ్లు దారుణంగా పడిపోయాయి.
మొత్తంగా వారం రోజులకు కలిపి కేవలం రూ.92 లక్షల వసూళ్లను మాత్రమే రాబట్టింది. ఇంత ఘోరమైన రెస్పాన్స్‌ను ఊహించని వీవీ వినాయక్(VV Vinayak) అవాక్కయ్యారట. నిజానికి టాలీవుడ్‌ను షేక్ చేసిన వీవీ వినాయక్ ఇలా ఆలోచన లేకుండా సినిమా చేయడమేంటని నెటిజన్లు సైతం విస్తుబోతున్నారు.