Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడవ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్, టైటిల్‌ తాజాగా విడుదలయ్యాయి. మొత్తానికి మహేష్ సినిమాతో పాటు టైటిల్ తొలిసారిగా ఊర మాస్‌గా ఉండబోతున్నాయి. ఈ సినిమాకి చిత్ర యూనిట్ ‘గుంటూరు కారం’(Guntur Kaaram) అనే ఊర మాస్ టైటిల్ ని ఖరారు చేసింది. ఇక మహేష్‌ని అయితే మనం మునుపెన్నడూ కూడా ఇంత ఊరమాస్‌గా చూసి ఉండమనడంలో సందేహం లేదు.

గతంలో స్మోక్ చేస్తూ మహేష్ కనిపించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. ఈ సినిమాలో బీడీ తాగుతూ కనిపించాడు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టరేనన్న టాక్ ఇప్పటికే వచ్చేసింది. ఇక తాజాగా విడుదలైన టీజర్‌లో ‘ఏంది అలా చూస్తున్నావ్..?, బీడీ 3D లో కనిపిస్తుందా’ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ రచ్చ లేపుతోంది. ఇక బాలయ్య సినిమాల్లో మాత్రమే కనిపించే జీపులు గాల్లోకి లేవడం వంటి సన్నివేశాలు గుంటూరు కారం సినిమాలో హైలైట్‌గా నిలిచాయి.

Advertisement
Guntur Kaaram: వామ్మో.. ఈ కాపీ క్యాట్ గోలేంటి? మహేష్ టీజర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్..

ఇక టీజర్ చూస్తుంటే.. మనకైతే అచ్చు గుద్దినట్టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘సిత్తరాల సిరపడు’ సాంగ్ సీన్స్ మాదిరిగా అనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం ఇందుకు ఏమీ తీసిపోలేదు. అచ్చంగా ‘సిత్తరాల సిరపడు’ను తలపిస్తోంది. అలాగే రీసెంట్ గా విడుదలైన రామ్ – బోయపాటి మూవీ టీజర్ గ్లిమ్స్ కూడా గుర్తుకు వస్తుంది. దీనిని చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తమనే అంటే.. త్రివిక్రమ్ కూడా అలాగే తయారయ్యారని మండిపడుతున్నారు. ఈ కాపీ క్యాట్ సన్నివేశాల కారణంగా సినిమాకు ఏమైనా ఇబ్బంది వస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు.