టు పీస్ బికినీతో నెట్టింట కాకరేపుతున్న నటి.. యాంకర్ ప్రదీప్‌ పేరిట రచ్చ రచ్చ

టు పీస్ బికినీతో నెట్టింట కాకరేపుతున్న నటి.. యాంకర్ ప్రదీప్‌ పేరిట రచ్చ రచ్చ

టు పీస్ బికినీతో నెట్టింట ఓ బ్యూటీ కాకరేపుతోంది. ఈ అమ్మడి విషయంలో యాంకర్ ప్రదీప్‌ని తీసుకొచ్చి సోషల్ మీడియా నానా రచ్చ చేస్తోంది. అసలు ఎవరా భామ? మధ్యలో యాంకర్ ప్రదీప్ ఎందుకొచ్చాడు? అంటే చాలా కథే ఉంది. ఆ ముద్దుగుమ్మ పేరు జ్ఞానేశ్వరి. స్టార్ యాంకర్‌గా ఎదిగిన ప్రదీప్ మాచిరాజు చేసిన కొన్ని ప్రయోగాత్మక షోలలో పెళ్లి చూపులు ఒకటి. ఈ షోలో ప్రదీప్ తన కోసం స్వయంవరం ఏర్పాటు చేసుకున్నాడు.

పెళ్లి చూపులు పేరిట ఓ రియాలిటీ షోని అప్పట్లో ప్రదీప్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ షో అట్టర్ ఫ్లాఫ్. అప్పట్లో ఈ షో పేరుతో ప్రదీప్‌ని నెట్టింట జనాలు ఏకిపారేశారు. అయితే ఈ షోలో ప్రదీప్ మాచిరాజు మనసు గెలుచుకున్న అమ్మాయే.. జ్ఞానేశ్వరి. నిజానికి ఈ షో ప్రకారం జ్ఞానేశ్వరిని ప్రదీప్ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ చేసుకోలేదు. అయితే కొంత కాలమైతే జ్ఞానేశ్వరితో ప్రదీప్ రిలేషన్‌లో ఉన్నాడంటూ ప్రచారం జరిగింది.

టు పీస్ బికినీతో నెట్టింట కాకరేపుతున్న నటి.. యాంకర్ ప్రదీప్‌ పేరిట రచ్చ రచ్చ

ఆ తరువాత ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. ప్రస్తుతం జ్ఞానేశ్వరి మోడల్‌గానే కాకుండా నటిగా కూడా రాణిస్తోంది. తాజాగా జ్ఞానేశ్వరి టు పీస్ బికినీలో దర్శనమిచ్చింది. జీరో సైజ్‌తో అమ్మడు యూత్‌కి పిచ్చెక్కిస్తోంది. అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజెన్స్ ఆగుతారా? అమ్మడి ఫోటోలపై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ ప్రదీప్‌ని మధ్యలోకి లాగి మరీ రచ్చ చేస్తున్నారు.