బిగ్‌బాస్ లవర్స్‌కు గుడ్ న్యూస్..

బిగ్‌బాస్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 

బుల్లితెర ప్రేక్షకుల నుంచి అమితాదరణ పొందుతున్న రియాలిటీ షోలలో బిగ్‌బాస్ ఒకటి. ఇది ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఏడో సీజన్ అయితే ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో ఆదరణ పొందింది. దీంతో నిర్వాహకులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. వీలైనంత త్వరగా సీజన్ 8ను ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే పనులు కూడా ప్రారంభించినట్టు సమాచారం. 

కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో కసరత్తు జరుగుతోందట. అది పూర్తైతే ఇక మిగిలిన పనులు శరవేగంగా జరుగుతాయి. ఇక సీజన్ 7 అయితే దుమ్మురేపే టీఆర్పీతో నడిచింది. ఈ షో అత్యధికంగా 21.7 టీఆర్పీని సాధించింది. ఎన్ని కాంట్రవర్సీలు ఎదురైనా బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిగ్‌బాస్ షోపైన కోర్టులో కేసు కూడా పడింది. సాంప్రదాయవాదులు ఈ షోను బ్యాన్ చేయాలని పోరాడుతున్నారు.

ఇక సీజన్ 7 చివరి రోజున ఈ షో హింసకు దారి తీసింది. ఫైనలిస్ట్ అయిన అమర్ కారు అద్దాలను కొందరు ధ్వంసం చేశారు. నానా రచ్చ చేశారు. అయినా సరే.. షోకి వచ్చిన రేటింగ్‌తో సీజన్ 8ను త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులు చూస్తున్నారు. అయితే ఈ సీజన్ జూలైలో ప్రారంభం కానుందట. ఇక ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారట.