యంగ్ హీరోతో శ్రీముఖి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..!

యంగ్ హీరోతో శ్రీముఖి ప్రేమాయణం.. త్వరలోనే పెళ్లి..!

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై తొలుత ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఎందుకో శ్రీముఖికి కాలం కలిసి రాలేదు. బుల్లితెరపై మాత్రం ఆమె కెరీర్ మూడు పువ్వులు… ఆరు కాయలుగా ఉంది. శ్రీముఖి పటాస్ షో ద్వారా కెరీర్ ప్రారంభించింది. ఆ షో మంచి సక్సెస్ సాధించింది. శ్రీముఖికి కూడా మంచి పేరొచ్చింది. ఇక అంతే శ్రీముఖి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇక బిగ్‌బాస్ సీజన్ 3లోనూ శ్రీముఖి సందడి చేసింది. రన్నరప్‌గా నిలిచింది. ఆ తరువాత కూడా బుల్లితెరపై సందడంతా శ్రీముఖిదే. తాజాగా శ్రీముఖి పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. అమ్మడు పెళ్లి చేసుకోబోతోందట. వరుడు ఓ యంగ్ హీరో అని టాక్. దాదాపు నాలుగేళ్లుగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారట. ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారట.

ఇరువురూ తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారట. ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లికి శ్రీముఖి జంట సిద్ధమవుతోందట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది మాత్రం తెలియరావడం లేదు. గతంలోనూ శ్రీముఖి ప్రేమ, పెళ్లంటూ కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం, నీతోనే డాన్స్ 2.0 వంటి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. పైగా స్పెషల్ ఈవెంట్స్‌లోనూ సందడి చేస్తోంది.