Manchu Manoj: మంచు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్?
మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj)ల మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. అన్నదమ్ముల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఇప్పటి వరకూ బయటకు వచ్చింది లేదు. కానీ నేడు ఏకంగా మనోజ్ ఫేస్బుక్ పోస్ట్ పెట్టడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. విష్ణు (Vishnu) తన ఇంటికి వచ్చి తన మనుషులను, బంధువులను ఇలా కొడతాడంటూ మంచు మనోజ్ ఫేసేబుక్లో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తన మనిషి సారధి (Sarathi)ని కొట్టినట్టు మనోజ్ ఆరోపించాడు.
తన గురించి అనుచితంగా మాట్లాడాడంటూ సారథిపై కోపం పెంచుకున్న విష్ణు.. నిన్న అతని నివాసానికి వెళ్లి గొడవ పడ్డాడు. అన్నదమ్ముల మధ్య సారథే మనస్పర్థలు సృష్టించాడని విష్ణు (Manchu Vishnu) ఆరోపిస్తున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారం మంచు మోహన్‌బాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వ్యవహారాన్ని రచ్చకు లాగినందుకు మనోజ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తానికి ఈ వ్యవహారమంతా టాలీవుడ్ (Tollywood)లో హాట్ టాపిక్‌గా మారింది. పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో మనోజ్(Manchu Manoj) తన పోస్టును డిలీట్ చేశాడు.
ఇక మంచు విష్ణుపై మనోజ్(Manchu Manoj) ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తన సన్నిహితులను కొట్టడంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే మంచు మోహన్ బాబు (Manchu Mohanbabu) వ్యవహారంలో ఎంటర్ అయ్యారు కాబట్టి కేసు వరకూ వెళతాడో లేదో చూడాలి. అయితే ఈ గొడవపై తాజాగా మంచు లక్ష్మి సైతం స్పందించారు. సోషియల్ మీడియాలో మనోజ్ పెట్టిన వీడియో గురించి తనకు తెలియదన్నారు. తన ఇంటికి మధ్యాహ్నం లంచ్‌కి మా బంధువులను ఆహ్వానించానన్నారు. ఫేస్ బుక్‌లో పెట్టిన వీడియో కానీ, తీసేసిన వీడియో గురించి కానీ తనకేమీ తెలియదన్నారు.
ఇవీ చదవండి:
Manchu Vishnu: ఒక్క విష్ణు తప్ప.. మిగిలిన వాళ్లందరిదీ ఒకటే దారి.. సేమ్ సీన్ రిపీట్