త్రిష దెబ్బకు తట్టుకోలేక మలయాళానికి షిఫ్ట్ అయిన నయనతార..!

త్రిష దెబ్బకు తట్టుకోలేక మలయాళానికి షిఫ్ట్ అయిన నయనతార..!

నయనతార కెరీర్ ఒక హిట్.. రెండు ఫ్లాపులు అన్నట్టుగా కొనసాగుతోంది. గత ఏడాది జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే నయన్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక తమిళంలో నటించిన రెండు చిత్రాలు ఇరైవన్‌, అన్నపూరణి మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ప్రస్తుతం నయన్ చేతిలో బాగానే సినిమాలున్నాయి.  మాధవన్‌తో కలిసి టెస్ట్‌ అనే ప్రాజెక్ట్‌లోనూ.. కొత్త దర్శకుడు టూయుటూ విక్కీ దర్శకత్వంలో మన్నాగట్టి, సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో నటిస్తోంది.

ఈ సినిమాల్లో ఏదో ఒకటి అయినా హిట్ అయితే ఓకే లేదంటే నయన్‌కు కష్టాలు ప్రారంభమైనట్టే. మరోవైపు ఆమెకు త్రిష గట్టి పోటీనిస్తోంది. కోలీవుడ్‌లో నయన్‌కు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందరి చూపు ప్రస్తుతం త్రిష పైనే ఉంది. దీంతో నయన్ చూపు మలయాళ చిత్ర పరిశ్రమ వైపు మళ్లినట్టు సమాచారం. తన మాతృభాషలోనే ఇక ముందు రాణించాలని బావిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి కూడా నయన్‌కు మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది.

గతంలో మమ్ముట్టి, నివిన్‌బాలీ వంటి స్టార్‌ హీరోలతో నయన్ నటించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ చిత్రంలో నటించేందుకు ఆమె సిద్ధమవుతున్నట్టు టాక్. దీనికి టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయిందట. డియర్ స్టూడెంట్ అని ఈ చిత్రానికి టైటిల్ పెట్టారట. ఈ చిత్రంలో నయన్ టీచర్ పాత్రను పోషిస్తోందట. దీనికి సమంధించని పోస్టర్‌ను చిత్ర యూనిట్ తమిళ నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో నివిన్ బాలి హీరోగా నటిస్తున్నాడు.