అందుకే ఆ చిన్న హీరోని చిరు ఆకాశానికెత్తారా ?

అందుకే ఆ చిన్న హీరోని చిరు ఆకాశానికెత్తారా ?

మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో చిన్న హీరోలందరినీ పైకి లేపుతున్నారు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండను ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేశారు. అయితే విజయ్ దేవరకొండను చిన్న హీరో అనీ అనలేం.. అలాగని స్టార్ హీరో అని అనలేం. గీత గోవిందం తర్వాత కూడా ఒకట్రెండు సినిమాలు ఆ రేంజ్ హిట్ అయ్యుంటే విజయ్ స్టార్ డమ్ ఎక్కడో ఉంది.

ఇక ఈ విషయాలన్నీ పక్కనబెడితే మెగాస్టార్ తాజాగా మరో హీరోను పైకి లేపారు. సౌత్ ఇండియా ఫెస్టివల్-2024లో మాట్లాడుతూ.. ‘హనుమాన్’ మూవీ ఫేమ్ తేజ సజ్జాని ఏకంగా ఆకాశానికెత్తేశారు. తేజా సజ్జాను చూపిస్తూ ఆ కుర్రోడిని చూశారా? హనుమాన్ సినిమా చేశాడని తెలిపారు. అంతటితో ఆగారా? 25 ఏళ్ల క్రితం బాలనటుడిగా కెరీర్ ప్రారంభించాడని..తనతో ఇంద్ర చిత్రంలో నటించాడని తెలిపారు.

Chiranjeevi Teja Sajja

ఇంద్ర సినిమా తర్వాత తేజా ఎంతో ఎదిగాడని.. అతడికి ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని చిరు తెలిపారు. కేవలం తనను అభిమానిస్తూ.. తన చిత్రాలను స్ఫూర్తిగా తీసుకుని హీరో అయ్యాడని తెలిపారు. ‘హనుమాన్’తో తనేంటనేది తేజా ప్రూవ్ చేసుకున్నాడని చిరు తెలిపారు. తాను కూడా హనుమాన్‌పై సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని కానీ తాను చేయలేకపోయానన్నారు. తన ప్రయత్నాన్ని తేజా ముందే చేశాడని చిరు మెచ్చుకున్నారు.