Ram Charan: గేమ్ చేంజర్‌ తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా స్టోరీ ఇదేనట..

Ram Charan: గేమ్ చేంజర్‌ తర్వాత రామ్ చరణ్ చేయబోతున్న సినిమా స్టోరీ ఇదేనట..

ఆర్ఆర్ఆర్(RRR) చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుసగా సినిమాలను ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game Changer) మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ(Kiara Adavani), అంజలి(Anjali) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) మరో సినిమాకు కూడా ఓకే చెప్పేశాడని టాక్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన (Buchi Babu Sana) చెప్పిన కథకు చెర్రీ బాగా కనెక్ట్ అయ్యాడని టాక్. వెంటనే ఓకే చెప్పేశాడట.

పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని టాక్. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ తో క‌లిసి వృద్ధి సినిమాస్ ఈ పీరియాడిక్ డ్రామాని నిర్మించ‌నున్నారని సమాచారం. గేమ్ చేంజర్ (Game Changer) షూటింగ్ పూర్తవగానే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్.

Ram Charan in RRR movie

ఇక ఈ సినిమా స్టోరీపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాడీ బిల్డర్ కోడి రామ్మూర్తి నాయుడి లైఫ్ స్టోరీనే సినిమాగా రూపొందించనున్నారట. దీనికోసం చెర్రీ ఫుల్‌గా కండలు పెంచేస్తాడని టాక్ నడుస్తోంది.

రామ్మూర్తి తన చిన్నతనంలో తల్లి మరణించడంతో విజయనగరంలో తన మామయ్య వద్ద పెరిగారు. ఆయనకు వ్యాయామం అంటే విపరీతమైన ఆసక్తి. దీంతో చదువుతో పాటే వ్యాయామంపై కూడా దృష్టి సారించారు. అయ‌న లైఫ్ స్టోరీకి ఫిక్షనల్ అంశాల‌ని జోడించి పీరియాడిక్ డ్రామాగా రూపొందించనున్నారని టాక్. లైఫ్ స్టోరీస్ ఇప్పటికీ చాలానే వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అయ్యాయి. ఎందుకంటే వారి స్టోరీ ముందే జనానికి తెలిసి ఉండటంతో అంతగా ఆదరణకు నోచుకోవు. చెర్రీ(Ram Charan) విషయంలో వినిపిస్తున్న టాక్ నిజమేనా? కేవలం ప్రచారమేనా? అనేది తెలియాల్సి ఉంది.

Google News
థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!