ఆ హీరోతో పని చేయను.. చిరాకని చెప్పేసిన జాన్వీ..

ఆ హీరోతో పని చేయను.. చిరాకని చెప్పేసిన జాన్వీ..

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌.. ఇండస్ట్రీకి వచ్చి మూడు నాలుగేళ్లు అవుతున్నా కూడా స్టార్ డమ్‌ను అయితే సంపాదించుకోలేకపోయింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘దేవర’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. అంచనాలు కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా హిట్ అయితే టాలీవుడ్‌లో జాన్వీ కెరీర్‌లో ఢోకా ఉండదు. 

ఇక జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రాల్లో రూహి ఒకటి. ఈ సినిమా హారర్‌ కామెడీగా తెరకెక్కింది. ఈ సినిమాలో రాజ్‌ కుమార్‌ రావు హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా రిలీజ్‌ సమయంలో రాజ్ కుమార్ గురించి చాలా అనుకుందట. రాజ్‌కుమార్‌తో పని చేయాలంటే చిరాకుగా ఉందని… ప్రతిసారి ఆయనతో కలిసి ఎలా నటించగలను? అని తెగ ఫీలైపోయిందట.  అయితే ఆయన చాలా టాలెంటెడ్ అని.. నటిగా తన నుంచి ఎంతో నేర్చుకోవచ్చని జాన్వీ భావించిందట.

రాజ్‌కుమార్‌తో కలిసి పని చేయడం ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందని.. తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్న ఫీలింగ్‌ వస్తుందని జాన్వీ తెలిపింది. ఇన్ని మాటలు మాట్లాడిన జాన్వీ 

మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి చిత్రంలో మరోసారి రాజ్‌కుమార్‌ రావుతో జోడీ కట్టింది. ఇక ఈ సినిమాకు మంచి టాక్ వస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ కపిల్ షోకు హాజరైంది. దీనిలో కపిల్ శర్మ..  రాజ్‌కుమార్‌తో పని చేయడం చిరాకని.. మళ్లీ పని చేయనన్నావ్‌? అని ప్రశ్నించారు. దీనికి జాన్వీ.. సినిమా ప్రమోషన్ కోసం అలా చెప్పానంటూ ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చి జాన్వీ ఎస్కేప్ అయ్యింది.