Keerthy Suresh: కీర్తి సురేష్‌కు కాబోయే భర్త ఇతనేనట.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో చూశారా?
కీర్తి సురేష్(Keerthy Suresh).. ఈ ముద్దుగుమ్మకు పరిచయం అక్కర్లేదు. కానీ అమ్మడు తల్లిదండ్రులకు మంచి మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉందన్న విషయం కొందరికే తెలుసు. నాన్న సురేష్ వచ్చేసి నిర్మాత, అమ్మ మేనక నటి. కానీ ఈ ముద్దుగుమ్మ వారి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా ఎప్పుడూ ఫలానా వారి కూతురనే ట్యాగ్‌ను మోయలేదు. సొంతంగానే కావల్సినంత ఇమేజ్‌ను సంపాదించుకుంది.
కీర్తి సురేష్(Keerthy Suresh) మాలీవుడ్ నటిగా సినీ రంగ ప్రవేశం చేసినా కూడా టాలీవుడ్‌లో కావల్సినంత పేరును తెచ్చుకుంది. మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి(Savitri) పాత్రలో జీవించి అందరి ప్రశంసలను అందుకోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఇక ఆ తరువాత అమ్మడి రేంజే మారిపోయింది. ఇక దసరా చిత్రం ఈ ముద్దుగుమ్మ కెరీర్‌కు కావల్సినంత హైప్ ఇచ్చింది.
ఇప్పుడు అమ్మడి పెళ్లి వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి. పర్హాన బీన్ లియాకత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అమ్మడు లియాకత్‌తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతోందట. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి అని సమాచారం. లికాయత్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి నెటిజన్లకు అడ్డంగా దొరికి పోయింది. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? కీర్తి(Keerthy Suresh)కి కాబోయే వరుడు ఇతనేనంటూ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.