Sreeleela: సినిమాలపై పిచ్చితో శ్రీలీల ఏం కోల్పోయిందో తెలిస్తే..
కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లు టాలీవుడ్‌లో చాలా తక్కువ అయితే కనీసం సినిమాలు ఫట్ అయినా కూడా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరోయిన్స్ శ్రీలీల(Sreeleela) తప్ప మరొకరు దాదాపు లేరనే చెప్పాలి. అమ్మడికి హిట్, ఫట్‌లతో సంబంధం లేదు. అమ్మడి తొలి సినిమా పెళ్లి సందడి డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. ఆ తర్వాత నటించిన చిత్రం ధమాకా కాస్త కలిసొచ్చింది. అంతే అమ్మడి కెరీర్ దెబ్బకు టర్న్ అయిపోయింది.
డ్యాన్స్‌లు సైతం అమ్మడు ఇరగదీస్తుండటం.. యూత్‌తో ముద్దుగుమ్మలో క్రేజ్ ఎక్కువగా ఉండటంతో అవకాశాలు తన్నుకుంటూ వస్తున్నాయి. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగానే కొందరు స్టార్ హీరోయిన్లు దాదాపు కనిపించకుండా పోయారు. ఈ రేంజ్ డామినేషన్ ఇంత తక్కువ సమయంలో రీసెంట్‌గా శ్రీలీల(Sreeleela) విషయంలోనే చూస్తున్నాము. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏ ఏ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేయక మానదు.
ప్రస్తుతం అమ్మడు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, నితిన్ (Nithiin), విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రామ్ పోతినేని(Ram Pothineni), పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnavtej) సరసన నటిస్తోంది.
అమ్మడి లిస్ట్ చాలా పెద్దది. మరి ఈ సినిమాలన్నీ ఎప్పటికి పూర్తవుతాయో కానీ అమ్మడి ఈ స్థాయికి రావడానికి చేసిన కృషి మాత్రం ఆసక్తికరమే. నటనపై పిచ్చితో డ్యాన్స్‌పై ఆసక్తి పెట్టి బాల్య జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోయిందట. కనీసం తల్లిదండ్రులతో కలిసి ఎక్కువ సమయం కూడా గడపలేకపోయిందట. మొత్తానికి తన బాల్యాన్నే కోల్పోయిందట.