Lavanya Tripathi: లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: లిప్ కిస్ ఇవ్వాల్సి ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదిలేసిన లావణ్య

అందాల రాక్షసి’ సినిమాతో వెండితెర కి హీరోయిన్ గా పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఇంతకు ముందు అయితే ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పాల్సి వచ్చేదేమో కానీ ఇప్పుుడు మెగా ఫ్యామిలీకి కోడలు కాబోతుండటంతో అమ్మడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ఏం మాట్లాడినా కూడా వైరల్ అయిపోతోంది. అప్పట్లో పట్టించుకోని విషయాలన్నీ ఇప్పుడు తెగ హైలైట్ అయిపోతున్నాయి.

అంతేకాదు.. అప్పట్లో ఏదైనా జరిగినా కూడా దాని వెనుక కారణం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అనుకోవాల్సి వస్తోంది. తాజాగా లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ప్రధాన పాత్రలో రూపొందిన ‘గీత గోవిందం’(Geetha Govindam) మూవీ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లోనే సుమారుగా 80 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను గడగడలాడించింది.

Advertisement
Varun Tej, Lavanya Tripathi

ఈ సినిమాలో నటించిన రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు ఎంత మంచి పేరు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మడు ఏకంగా స్టార్ హీరోయిన్ల మధ్య కుర్చీ వేసుకుని కూర్చొండిపోయింది. అయితే ఈ సినిమా తొలుత లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)కే వచ్చిందట. కానీ విజయ్ అంతకు ముందు నటించిన ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) మూవీ లిప్ లాక్స్‌తో నిండిపోవడంతో ఈ సినిమాలో కూడా కనీసం ఒక్కటైనా ఉంటుందని డ్రాప్ అయ్యిందట. వరుణ్ తేజ్(Varun Tej) కూడా ఈ సినిమా చేసేందుకు లావణ్యకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని టాక్.

ఇవీ చదవండి:

డైరెక్టర్ కృష్ణవంశీ, నేను ఒకే అమ్మాయిని ప్రేమించాం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. : జేడీ చక్రవర్తి

మెగా ఫ్యామిలీ కోరిక తీరలేదా? సెంటిమెంట్ వెంటాడిందా?

ఆదిపురుష్ వసూళ్లన్నీ హమ్మక్.. తప్పుతప్పుగా చెబుతున్నారట..

రాకేష్ మాస్టర్ దుస్థితి గురించి తెలిస్తే కన్నీళ్లాగవు..!