MM Keeravani: ‘ఆస్కార్’ అందుకున్నాక పూర్తిగా బెడ్‌కే పరిమితమైన కీరవాణి..!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి (MM Keeravani) పూర్తిగా బెడ్‌కే పరితమయ్యారట. ఆయనకు ఏమైందంటూ అభిమానులు కంగారు పడుతున్నారు. ఆయన సంగీతానికి పరవశులయ్యే ఫ్యాన్స్ కొన్ని కోట్ల మంది ఉన్నారు. మూడు దశాబ్దాలకు పైగా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయన ప్రస్థానం నిర్విరామం. కొన్ని వందల హిట్ సాంగ్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆ పాటలు, ఈ పాటలు అన్న తేడా లేకుండా ఆధ్యాత్మికం నుంచి రొమాంటిక్ సాంగ్స్ వరకూ అన్ని సాంగ్స్‌ను అద్భుతంగా బాణీ కడతారు. అందుకేనేమో ఆయన ఫ్యాన్స్‌కు ఏజ్ లిమిట్ లేదు.
అన్ని వయసుల వారూ కీరవాణి (MM Keeravani) సంగీతాన్ని అభిమానిస్తారు. ఇక దాదాపు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలన్నింటినీ కీరవాణియే సంగీతం అందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ‘ఆర్ఆర్ఆర్’కు కూడా సంగీతం అందించి ఆస్కార్ అవార్డు (Oscar Award)ను అందుకున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆస్కార్ వేడుకల్లో కీరవాణి, చంద్రబోస్ (Chandrabose) ఈ అవార్డును అందుకున్నారు. ఇక లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియాకు వచ్చిన అనంతరం నుంచి కీరవాణి పూర్తిగా బెడ్‌కే పరిమితమయ్యారని సమాచారం.
కీరవాణి (MM Keeravani) ఒక హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆయన బెడ్‌కే పరిమితమవడానికి ప్రత్యేక కారణాలంటూ ఏమీ లేవు లెండి. ఆస్కార్ వేడుకల్లో భాగంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ (RRR Movie) ప్రమోషన్స్ కోసం పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరవుతూ క్షణం తీరిక లేకుండా చిత్ర ప్రముఖులు గడిపారు. వారిలో కీరవాణి కూడా ఒకరు. దీంతో విపరీతంగా అలసిపోయారట. ఈ క్రమంలోనే హెల్త్ సరిగా లేకపోవడంతో ఆయన పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నట్టు సమాచారం.