Nikhil Siddharth wife: శాడ్ స్టోరీస్ చెప్పి పడేశాడంటూ హీరో నిఖిల్ భార్య సంచలనం..
హీరో నిఖిల్ (Hero Nikhil Siddharth) గురించి ఆయన భార్య పల్లవి (Nikhil Siddharth Wife Pallavi) కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. టాక్ షోలలో భాగంగా ఈటీవీలో ‘అలా మొదలైంది’ (Ala Modalaindi) అన్న షో ప్రారంభం కానుంది. ఈ షోకి హోస్ట్‌గా వెన్నెల కిషోర్ (Vennela Kishore) బుల్లితెరపై సందడి చేయనున్నాడు. తొలిసారిగా వెన్నెల కిషోర్ హోస్ట్‌గా కనిపించి మెస్మరైజ్ చేయబోతున్నాడు. ఈ షోకి సంబంధించిన తొలి ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
అలా మొదలైంది టాక్ షోకి తొలి సారి గెస్టులుగా హీరో నిఖిల్ (Nikhil Siddharth).. ఆయన భార్య పల్లవి హాజరయ్యారు. ఈ షోలో పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నిఖిల్ దంపతుల నుంచి ఆసక్తికర విషయాలు రాబట్టేందుకు వెన్నెల కిషోర్ యత్నించాడు. ఫస్ట్ క్వశ్చన్‌తోనే నిఖిల్‌ను భార్య దగ్గర ఇరికించేశాడు. పల్లవి (Pallavi) పేరెంట్స్ పేర్లు చెప్పాలని వెన్నెల కిషోర్ అడగ్గా.. నీళ్లు నమిలి అడ్డంగా దొరికిపోయాడు నిఖల్. వెన్నెల కిషోర్ మాత్రం నవ్వుకుని ఊరుకున్నాడు. కానీ పల్లవి మాత్రం కౌంటర్ వేసింది.
పెళ్ళైపోయింది కదా.. ఇక వాళ్లతో పనేంటని నిఖిల్ (Nikhil Siddharth) మర్చిపోయాడని పల్లవి కౌంటర్ వేసింది. అనంతరం తమ లవ్ స్టోరీ చెప్పాలని వెన్నెల కిషోర్ అడగ్గా.. ‘పేరెంట్స్ కి చెప్పిన లవ్ స్టోరీ చెప్పాలా? నిజంగా జరిగిన స్టోరీ చెప్పాలా?’ అంటూ నిఖిల్ సెటైర్ వేశాడు. నిజంగా జరిగిందే చెప్పమంటే.. మా పేరెంట్స్ ఈ షో చూస్తారేమో అంటూ నిఖిల్ ఇబ్బంది పడ్డాడు. అయితే పల్లవికి శాడ్ స్టోరీస్ చెప్పి నిఖిల్ పడేశాడట. నిఖిల్ (Nikhil Siddharth) చెప్పిన స్టోరీస్ విని అతనికి అన్ని బాధలున్నాయా? అని తెగ ఫీలైపోయిందట పల్లవి. మొత్తానికి నిఖిల్ దంపతులు ఈ షోని బాగా హైలైట్ చేశారనే చెప్పాలి.