ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఫీచర్స్ తెలిస్తే..!

ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి కొత్త కారు.. ఫీచర్స్ తెలిస్తే..!

ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపై ఇష్టం ఉంటుంది. కానీ సామాన్యులమైతే ఇష్టపడిన దానిని కొనుక్కునేందుకు కాస్త టైం పడుతుంది. అదే స్టార్ హీరోలైతే ఇలా మనసులో ఆలోచన వస్తే చాలు అలా వెళ్లి కొనుక్కొచ్చేస్తారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి వాచ్‌లు, కార్లంటే పిచ్చట. తనకు నచ్చితే చాలు.. వెంటనే కొనుక్కొచ్చేస్తారట. తాజాగా ఎన్టీఆర్ గ్యారేజ్‌లోకి మరో కొత్త కారు యాడ్ అయ్యిందట. దాని కాస్ట్, ఫీచర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ స్థిర, చర ఆస్తులన్నీ పక్కనబెడితే కేవలం ఆయన వద్ద ఉన్న కార్లే కొన్ని కోట్ల ఖరీదు చేస్తాయని టాక్. తాజాగా మరో కారు కొన్నాడట. మెర్సిడెస్ బెంజ్ మే బాచ్ ఎస్ క్లాసిక్ యస్ 580  కారును ఎన్టీఆర్ కొన్నాడట. దాని రిజిస్ట్రేషన్ కోసం  ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్‌కు తారక్ రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్లాక్ కలర్ టీ షర్ట్.. బ్లూ జీన్స్ ధరించి బాగా స్టైలిష్‌గా తారక్ ఆర్టీవో ఆఫీస్‌కి వచ్చాడు. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ కొనుగోలు చేసిన లగ్జరీ కారు ఖరీదు రూ.3 కోట్లకు పైమాటే అట. అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్స్‌తో కారు డిజైన్ చేశారు. ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో కారులో ఆటోమేటిక్ అలారాన్ని మోగించవచ్చట. ఇక తారక్ కెరీర్ విషయానికి వస్తే.. ‘దేవర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయబోతున్నాడు.