చిరు ఇంట పవన్.. మెగా ఫ్యామిలీ సందడే సందడి

చిరు ఇంట పవన్.. మెగా ఫ్యామిలీ సందడే సందడి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తన సతీమణితో కలిసి ఎన్నికల్లో అఖండ విజయం అనంతరం తొలిసారిగా తన అన్నయ్య ఇవాళ (గురువారం) సాయంత్రం చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆయనకు మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం పలికింది. పవన్ తన వదినమ్మను చూడగానే ఆనందంతో చిన్న పిల్లాడిలా వదినమ్మ సురేఖను హత్తుకున్నారు. చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.

చిరు ఇంట పవన్.. మెగా ఫ్యామిలీ సందడే సందడి

పవన్‌కు ఆయన తల్లి హారతిచ్చి ఆశీర్వదించారు. అనంతరం వదిన సురేఖ పవన్ దంపతులకు దిష్టి తీశారు. పవన్‌ రాకతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ చేరి సందడి చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆయన సతీమణి ఉపాసన ఇద్దరూ ఎదురొచ్చి పవన్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. పవన్ సోదరీమణులు సైతం ఆయనకు ఘన స్వాగతం పలికారు.

చిరు ఇంట పవన్.. మెగా ఫ్యామిలీ సందడే సందడి

ఇక మెగా హీరోలు, మెగా డాటర్స్‌తో ఇల్లంతా సందడి వాతావరణం నెలకొంది. పవన్ చేత కేక్ కట్ చేయించారు. అన్నా వదినలు ముందుగా కేక్‌ను పవన్‌కు తినిపించారు. తల్లితో పాటు వదిన కాళ్లకు మొక్కి ఆశీర్వాదం అందుకున్నారు. ఇద్దరు తల్లులను దగ్గరకు తీసుకున్నట్టుగా కన్నతల్లిని.. వదినమ్మను దగ్గరకు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు.. ఫ్యాన్స్ ఆనందం ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

చిరు ఇంట పవన్.. మెగా ఫ్యామిలీ సందడే సందడి
Google News