NTR: ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

NTR: ఎన్టీఆర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్

ఒక నటుడు తను చేయబోయే క్యారెక్టర్ గురించి ఎంతలా కసరత్తు చేస్తాడు? అనే దానికి ఉదాహరణే యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR). తాజాగా ఆయన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జై లవకుశ మూవీలో రావణుడి పాత్ర కోసం తాను ఎంత కసరత్తు చేశాననేది ఎన్టీఆర్ ఆ వీడియోలో వివరించాడు. ఆ స్థాయిలో ఒక పాత్ర కోసం ఎన్టీఆర్(NTR) కసరత్తు చేస్తాడు కాబట్టే ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇక అసలు విషయంలోకి వెళితే..

‘జై లవకుశ’(Jai Lavakusa) సినిమా ప్రారంభానికి ముందే రావణుడి గురించి తెలుసుకునేందుకు.. ఆనంద్ నీలకంఠ రాసిన ‘అసుర'(Asura) అనే పుస్తకాన్ని ఎన్టీఆర్ చదివాడట. ఆ పుస్తకం ద్వారా రావణుడు 18 లోకాలకు రాజు మాత్రమే కాదని.. అసురుల చక్రవర్తి కూడా అని తెలుసుకున్నాడట. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలనే విషయాన్ని తెలుసుకున్నాడట. అలాంటి వ్యక్తి పాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలోనూ జాగ్రత్త వహించాలని గుర్తించాడట.

రాముడు కూడా యుద్ధ సమయంలో రావణాసురుడు చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడని.. అలా రావణడు ఎక్కడైనా నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలని ఎన్టీఆర్(NTR) తెలుసుకున్నాడట. ఆ పుస్తకం చదివాక రావణాసురు ఎలా ఉండాలనే దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఒక క్యారెక్టర్ కోసం నటుడే అంత పరిశోధన చేస్తే మూవీ మేకర్స్ ఎంత చేయాలి? దీనిపై ఆదిపురుష్ మేకర్స్‌ను ప్రభాస్ ఫ్యాన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్టీఆర్‌పై ఆయన ఫ్యాన్సే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Google News