రాశీ ఖన్నాను ఆ ఒక్కటీ అడగొద్దట..

రాశీ ఖన్నాను ఆ ఒక్కటీ అడగొద్దట..

అందాల భామ రాశి ఖన్నా టాలీవుడ్‌తో పాట బాలీవుడ్, కోలీవుడ్‌లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అమ్మడు ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లకేళ్లు గడుస్తున్నా కూడా స్టార్ స్టేటస్‌ను మాత్రం అందుకోలేక పోయింది. ఆకర్షణీయమైన రూపంతో కుర్రకారును కట్టిపడేస్తూ ఉంటుంది. గ్లామర్ పాత్రలకు సైతం అమ్మడు వెనుకాడదు. ఇటీవలి కాలంలో కాస్త స్లిమ్ అయిపోయి మరింత అందంగా తయారైంది.

అయినా సరే.. అమ్మడికి అవకాశాలు మాత్రం కరువే. ఇటీవలి కాలంలో హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన తిరు చిత్రంలో నటించింది. ఇక ఆ తరువాత కనిపించలేదు. ప్రస్తుతం అరణ్మణై 4 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాశి ఖన్నా రానుంది. ఈ చిత్రం సక్సెస్ అయితే ఓకే.. లేదంటే అమ్మడికి కెరీర్ కష్టాలు మరింత ఎక్కువవుతాయనడంలో సందేహం లేదు. అంతంత మాత్రం అవకాశాలు కూడా రావు.

ఇక తనకు నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిందీ ముద్దుగుమ్మ. ఇదంతా పక్కనబెడితే సినిమా అవకాశాలు లేకుంటే హీరోయిన్స్ చేసే మొదటి పని.. పెళ్లి చేసుకుని సైడ్ అయిపోవడం. కానీ ఈ ముద్దుగుమ్మకు 33 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి ఆలోచనే లేదు. దీంతో తాజాగా అమ్మడి పెళ్లి ప్రస్తావన ఓ ఇంటర్వ్యూలో రాగా.. ఆ ఒక్కటీ అడగొద్దని చెప్పింది.