Rajamouli: రాజమౌళి నన్ను అవమానించారు.. సీనియర్ నటి ఆవేదన..!

Senior actress says, Rajamouli insulted me

సీనియర్ నటి కాంచన (Senior Actress Kanchana).. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli)పై సంచలన కామెంట్స్ చేశారు. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జక్కన్న తనను అవమానించారని పేర్కొన్నారు. అసలు రాజమౌళికి, కాంచనకు ఏంటి సంబంధం? ఆమెను ఆయన అవమానించడమేంటి? అనుకుంటున్నారా? చాలా కాలం తర్వాత కాంచన అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాలో నటించారు. ఆ తరువాత ఆమె మళ్లీ ముఖానికి మేకప్ వేసుకున్నది లేదు. అయితే రాజమౌళి(Rajamouli) బాహుబలి చిత్రంలో ఒక పాత్ర కోసం ఆమెను సంప్రదించారట. 

రాజమౌళి(Rajamouli) కోరిన పాత్ర చేయడానికి కాంచన సైతం అంగీకరించారట. రెండు రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుందని కూడా చెప్పారట. దానికి కూడా కాంచన (Kanchana) ఓకే అన్నారట. అయితే రెమ్యూనరేషన్ మాత్రం రెండు రోజులకి రూ.5 లక్షలు అడిగానని ఆమె తెలిపారు. దీనికి రాజమౌళి ఆ పాత్ర కోసం అంత ఇవ్వలేమని.. నిజానికి ఐదు లక్షలు చాలా పెద్ద అమౌంట్ అని తిరస్కరించారని కాంచన వెల్లడించారు. ఇది తనను అవమానించడమేనని కాంచన పేర్కొన్నారు. కేవలం డబ్బుల కోసం ఆయన తనను పక్కన పెట్టేశారని.. మళ్లీ సంప్రదించలేదన్నారు.

Senior actress Kanchana says, Rajamouli insulted me

నిజానికి రాజమౌళి(Rajamouli)కి ఐదు లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ అని… ఆయన దగ్గర లేని డబ్బా చెప్పండంటూ కాంచన(Kanchana) ప్రశ్నించారు. తన విషయానికి వస్తే మటుకు ఐదు లక్షలు పెద్ద అమౌంట్ అన్నారు. తాను అడిగిన డబ్బు ఇచ్చి ఉంటే దేవుడికి సేవ చేసుకుని ఉండేదానన్నని కాంచన వెల్లడించారు. తప్పుగా అంటున్నానని అనుకోవద్దని… ఆర్టిస్టుల కష్టాలు ఎవరికీ తెలియదన్నారు. తన సమకాలీన నటులు ఎందరో నటించాడని సిద్ధంగా ఉన్నారని కానీ అవకాశాలు ఇవ్వడం లేదన్నారు. కేవలం ఐదు లక్షల కోసం రాజమౌళి తనను అవమానించారని కాంచన పేర్కొన్నారు.

థైస్ చూపిస్తూ తెగ రెచ్చిపోయిన అనసూయరాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు.. కిర్రెక్కిపోతున్న కుర్రకారు..!Ketika Sharma: కేతిక శర్మ హాట్.. హాట్ స్టిల్స్.. అదిరిపోలా!Trisha: అబ్బబ్బా.. ఏం అందం బాబోయ్..!Ananya Panday: నోరెళ్లబెట్టేలా చేస్తున్న లైగర్ భామ!