Rajendra Prasad: నరేష్ వరుస పెళ్లిళ్లపై రాజేంద్రప్రసాద్ దారుణమైన సెటైర్స్..
ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), నరేష్ (Naresh) కలిస్తే అక్కడి వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారిపోతుందో చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule) చిత్రంలో నటించారు. నందినీరెడ్డి (Nandini Reddy) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ యూనిట్ తొలిసారి ఉగాది (Ugadi) పర్వదినం సందర్భంగా మీడియా ముందుకు వచ్చింది. అంతా సంప్రదాయ దుస్తుల్లొ మీడియా ముందుకు రావడం విశేషం.
ఈ క్రమంలోనే నరేష్ (Naresh), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)లు ధోతీ, లాల్చి, పైన కండువా ధరించి ఈ సినిమా యూనిట్ తొలిసారిగా నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌కి వచ్చారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ.. నరేష్ (Naresh), తాను సోదరుల మాదిరిగా కలిసి ఉంటామని.. నరేష్ (Naresh) కత్తి అయితే తన రేంజ్ కత్తి తాను కాదు కాబట్టి.. తనను తాను ఒరగా అభివర్ణించుకున్నారు. నరేష్ (Naresh) ని చూపిస్తూ చూశారా? వాడెప్పుడు నిత్య పెళ్లి కొడుకులా ఉంటాడంటూ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) సెటైర్ వేశారు.
అంతేనా.. అదే విషయాన్ని నరేష్ (Naresh)ని సైతం రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) అడగ్గా.. అవును తాను నిత్య పెళ్లి కొడుకులా ఉంటానని నరేష్ (Naresh) కూడా సమాధానం ఇచ్చారు. వెంటనే రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) సైతం అవును నువ్వే నిత్య పెళ్లికొడుకువే అనడంతో అక్కడున్న వారంతా కడుపుబ్బ నవ్వేశారు. నరేష్.. పవిత్ర (Pavitra Naresh)తో తన వివాహం గురించే ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.