హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

హైకోర్టుకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఎందుకంటే..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య, ప్రముఖ నటి రేణు దేశాయ్ కోర్టు మెట్లెక్కారు. తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి కాదు.. పర్యావరణానికి ఏదైనా ప్రమాదం వాటిల్లుతుందని. హైదరాబాద్ సౌత్‌లో డెస్టినేషన్ సిటీగా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి రూపుదిద్దుకుంటుంది. దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే.. ఇది త్వరలోనే హైదరాబాద్ వాసులకు మరో పర్యాటక కేంద్రం అందుబాటులోకి వస్తుంది.

ఇక రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడ ఎకో పార్క్‌లో ప్రభుత్వం ఈ అక్వేరియాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే ఇది హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. పక్షుల ఆవాస కేంద్రంగా, దేశంలోనే అతిపెద్ద అక్వేరియంగా ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో అండర్ టన్నెల్ అక్వేరియంలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చస్తోంది. ఇప్పటికే కొత్వాల్ గూడలో శంకుస్థాపన జరిగింది. 

Advertisement

మరోవైపు ఉస్మాన్ సాగర్ ల్యాండ్ స్కేప్ ఎకో పార్క్ ని కూడా ప్రారంభించారు. ఈ ఎకో పార్కే ఇప్పుడు వివాదానికి బీజం వేసింది. ఈ నిర్మాణాన్ని ఆపేయాలంటూ రేణు దేశాయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఆక్వా మెరైన్ పార్క్ కోసం కృత్రిమ సరస్సును ఏర్పాటు చేయడమే దీనికి కారణం. కృత్రిమ సరస్సు వల్ల పర్యావరణం దెబ్బతింటుందనేది ప్రదాన అభియోగం. కాగా.. రేణుకి అండగా.. శ్రీదివ్య, సదా, దర్శకుడు శశికిరణ్ టిక్కా వంటి వారు మద్దతుగా నిలిచారు.

ఇవీ చదవండి:

చిరు ఇంత ఓవరయ్యారేంటి..? నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్స్..

ఓరినాయనో.. బిగ్‌బాస్ హౌస్‌ లోకి వెళ్తున్నది వీళ్ళే.. ఇక రచ్చ రచ్చే..

తనకు పుట్టిన బిడ్డకు గుండెలో రెండు రంధ్రాలున్నాయని తెలిసి తల్లడిల్లిపోయిన స్టార్ హీరోయిన్..

మెగాస్టార్ చిత్రంలో కీలక పాత్రలో రామ్ చరణ్ క్లాస్‌మేట్.. ఇంతకీ ఆయనెవరో తెలుసా?

‘బేబీ’ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్.. ఓటీటీలో నాలుగు గంటల సినిమా..

ఊర మాస్ గెటప్స్‌తో తలపడబోతున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్