కట్టప్ప ఇంట విషాదం..

కట్టప్ప ఇంట విషాదం.. ఆయన తల్లి మృతి

కట్టప్ప అలియాస్ సీనియర్‌ నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి నాదాంబాళ్‌ కాళింగరాయర్‌ నేడు కోవైలో కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఆమె వయసు 94 ఏళ్లు. నాదాంబాళ్‌ కాళింగరాయర్‌కు ఒక కొడుకు కల్పనా మండ్రాడియార్‌, రూపా సేనాధిపతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సత్యరాజ్ పలు సినిమాల్లో నటించి తెలుగుతో పాటు పలు భాషల్లో బాగా ఫేమస్ అయ్యారు. 

శుక్రవారం సాయంత్రం కోవైలో నాదాంబాళ్‌ కాళింగరాయర్‌  తుదిశ్వాస విడిచారు. అయితే ఆ సమయంలో సత్యరాజ్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఓ షూటింగ్‌లో పాల్గొన్న ఆయనకు తల్లి మరణ వార్త తెలియగానే కోయంబత్తూరుకు చేరుకున్నారు. ఇక సత్యరాజ్‌కు తల్లి అంటే చాలా ఇష్టమని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన తెలిపారు. సత్యరాజ్ నటన అంటే ఆమెకు చాలా ఇష్టమట.

కట్టప్ప ఇంట విషాదం.. ఆయన తల్లి మృతి

తను నటించిన సినిమాలు చూడటం తన తల్లికి చాలా ఇష్టమని సత్యరాజ్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. సత్యరాజ్ తల్లి మరణవార్తను తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ హీరో, మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. సత్యరాజ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇవీ చదవండి:

స్నేహను వార్న్ చేస్తున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..

బిగ్‌బాస్.. లేటెస్ట్ ప్రోమో అదుర్స్.. లాస్ట్‌లో నాగ్ ట్విస్ట్‌..

చడీ చప్పుడు లేకుండా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిపురుష్’

‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ

రష్మి ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది: సుధీర్