సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

బిగ్‌బాస్ ఫేమ్ అమర్‌దీప్ హీరో కాబోతున్నాడు. బుల్లితెరపై ఓ సీరియల్‌లో హీరోగా నటించిన అమర్.. ఇక ఇప్పుడు వెండితెరపై హీరో అవతారమెత్తబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? నటి సురేఖా వాణి కూతురు సుప్రీత. ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. కూతుర్ని హీరోయిన్‌ని చేయాలని సురేఖా వాణి చాలా ట్రై చేసింది. దీనికోసం ఇప్పటికే సుప్రీతకు యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా ఇప్పించిందట.

ఇక కెమెరాకు రాకముందే సుప్రీత విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. తల్లీకూతుళ్లిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తరచుగా ఇద్దరూ కలిసి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని డ్యాన్స్‌లు చేస్తుంటారు. అలాగే పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటారు. దీనికి సంబంధించిన పిక్స్, వీడియోలను ఇద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక సినిమా విషయానికి వస్తే.. అమర్, సుప్రీత మీద మొదటి రోజు కొన్ని సీన్లు చిత్రీకరించారు.

Advertisement
సురేఖా వాణి ముందే హీరోతో కూతురి రొమాన్స్..

మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో సురేఖా వాణి కూడా నటిస్తోంది. తల్లి పాత్రలోనే నటిస్తూ సుప్రీత షూటింగ్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో సురేఖా వాణి పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా  హీరో హీరోయిన్స్‌తో పాటు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పింది. మొత్తానికి తన కూతురిని వెండితెరపై చూడాలనుకున్న సురేఖా వాణి కల త్వరలోనే నెరవేరనుంది.