‘గుంటూరు కారం’ సినిమా నుంచి తమన్ ఔట్?

సినిమా ఫంక్షన్లలో పొగడ్తలు కామన్. కాకపోతే అన్నీ మనం అనుకున్నంత సాఫ్ట్ గా ఉండవు. ఈరోజు జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో హీరో అశ్విన్ బాబును, మ్యూజిక్ డైరక్టర్ తమన్ పొగిగాడు. ఆయన మాటల్లోనే..

“టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. టాలెంట్ తో పాటు కసి ఉండాలి. అశ్విన్ బాబుకు ఆ కసి ఒళ్లంతా ఉంది. పెద్ద కసిగాడు. ఆ పంతం-కసి వాడి అన్న నుంచి వచ్చిందా, పుట్టినప్పట్నుంచి ఉందా అనేది తెలియదు.”

ఇలా అశ్విన్ బాబును తనదైన శైలిలో పొగిడాడు తమన్.

క్రికెట్ లో సింగిల్ కొట్టి ఇవ్వమంటే అశ్విన్ ఇవ్వడని, విన్నింగ్ షాట్ తనే కొడతాడని.. గ్రౌండ్ లో బంతిని ఎంత బలంగా కొడతాడో, “శివం భజే” సినిమాతో బాక్సాఫీస్ ను కూడా అంతే గట్టిగా కొట్టాలని కోరుకున్నాడు.

Google News