సాయిపల్లవితో మళ్లీ అందుకే నటించలేదు: వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం ‘ఫిదా’. ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఎన్ఆర్ఐగా వరుణ్ తేజ్, తెలంగాణ అమ్మాయిగా సాయిపల్లవి అదరగొట్టారు. సినిమాతో పాటు వీరిద్దరి నటన కూడా హైలైట్ అనే చెప్పాలి. పాటలు కూడా మంచి హిట్ అవడంతో సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది.
ఇక ఎందుకోగానీ ‘ఫిదా’ తర్వాత వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో మరో సినిమా రానే లేదు. ఫ్యాన్స్ అయితే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే బాగుంటుందని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్‌కు కూడా దీనికి సంబంధించిన ప్రశ్నే ఎదురైంది. దీనికి కారణాన్ని వరుణ్ తేజ్ తెలిపాడు. తామిద్దరి కాంబోలో సినిమా కోసం సన్నాహాలు అయితే జరిగాయని వెల్లడించాడు.
ఈ సినిమాకు సంబంధించిన స్టోరీని కూడా ఇద్దరం విన్నామని.. కానీ స్టోరీ అంత మంచిగా ఏమీ అనిపించలేదట. వారిద్దరి కాంబోలో తిరిగి సినిమా వస్తే ‘ఫిదా’ను మించి ఉండాలని.. లేదంటే చేయకూడదని నిర్ణయించుకున్నామని తెలిపాడు. అందుకే మళ్లీ కలిసి నటించలేకపోయామని వరుణ్ తేజ్ తెలిపాడు. మరి అంత మంచి కథ ఎప్పుడు దొరుకుతుందో.. వరుణ్, సాయి పల్లవిని తిరిగి ఒకే స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామో..