అదెప్పుడో చచ్చిపోయిందన్నాడు.. వెన్నులో వణకు పుట్టింది: సన్నీలియోన్

అదెప్పుడో చచ్చిపోయిందన్నాడు.. వెన్నులో వణకు పుట్టింది: సన్నీలియోన్

శృంగార తార అనగానే మనకు గుర్తొచ్చేది సన్నీలియోన్. ఈ బాలీవుడ్ భామ తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఇక బుల్లితెరపై కూడా సందడి చేస్తోంది. ‘ స్ప్లిట్స్ విల్లా’ అనే కార్యక్రమానికి సన్నీలియోన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. తాజాగా సన్నీలియోన్ ఈ షోలో తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర ఘటనను గుర్తు చేసుకుంది. అదేంటంటే.. తన పెళ్లికి ముందు ఒక వ్యక్తిని సన్నీ డీప్‌గా లవ్ చేసిందట. అతను కూడా సన్నీని ఇష్టపడ్డాడట.

చాలా రోజుల పాటు కలిసి ఉన్న మీదట పెద్దల సమక్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారట. ఆ తరువాత తమ పెళ్లి ఎప్పటికీ గుర్తుండిపోయేలా హవాయి దీవుల్లో చేసుకోవాలనుకున్నారట. అయితే ఎంగేజ్‌మెంట్ అయిన నాటి నుంచి అతని మార్పు మొదలైందట. అనుమానం వచ్చి నిలదీస్తే నీపై ప్రేమ ఎప్పుడో చచ్చిపోయిందని చెప్పాడట. ఆ మాటతో తను నిలువెల్లా వణికిపోయిందట. పెళ్లి కోసం బట్టలు, నగలు కూడా కొనుక్కుందట.

అదెప్పుడో చచ్చిపోయిందన్నాడు.. వెన్నులో వణకు పుట్టింది: సన్నీలియోన్

పెళ్లి కోసమని భారీగా డబ్బు ఖర్చు పెట్టి ఏర్పాట్లన్నీ చేసుకున్నారట. కేవలం పెళ్లి రెండు నెలలుందనగా.. ఆమె ప్రియుడు ఇలా బాంబ్ పేల్చాడట. ఆ సమయంలో సన్నీ లియోన్ బాధను తట్టుకోలేకపోయిందట. నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది. దాని నుంచి బయటపడటం చాల కష్టమైపోయిందట. ఆ సమయంలోనే తనకు వెబర్ కనిపించాడని.. తనేంటో అతనికి తెలుసని చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి తన కష్టసుఖాల్లో వెబర్ తనకు తోడుగా ఉన్నాడని సన్నీలియోన్ వెల్లడించింది.