‘సలార్’ టీజర్ ఇంత ముందుగా ఎందుకు వదిలారు? కారణం ఏంటంటే..
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రూపొందుతున్న ‘సలార్’ మూవీ టీజర్ నేటి తెల్లవారుజామునే విడుదలైంది. మొత్తానికి ప్రశాంత్ నీల్ అయితే టీజర్‌తో ప్రభాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్‌లో ఉండటంతో చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభాస్‌కు వరుస ఫ్లాప్‌లు పడుతున్నాయి. ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ మూడ్‌లో ఉన్నారు.
ఇక సలార్ టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనే నిర్ణాయానికి వచ్చేశారు. ఒక పవర్ ఫుల్ డైలాగ్‌తో ప్రభాస్‌ను ఓ రేంజ్‌లో చూపించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే.. ఈ టీజర్‌పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉంది. మరి ఇంత ముందుగా టీజర్‌ను ఎందుకు వదిలారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.
దీనికి కారణం.. ‘ఆదిపురుష్’ అని తెలుస్తోంది. ఆదిపురుష్‌కి సలార్‌కి సంబంధం ఏంటి? అంటే ఏమీ లేదు కానీ ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ కూడా చాలా నెగిటివిటీని మూట గట్టుకున్నాడు. ఈ సినిమా దర్శకుడు ఓం రౌత్‌కి రామాయణం గురించి తెలియలేదు సరే.. మరి ప్రభాస్ తెలివి ఏమైంది? ప్రభాస్‌కి తెలియదా? ఆయనైనా ఒక మాట చెప్పాలి కదా.. అంటూ పెద్ద ఎత్తున నెగిటివిటీ వచ్చింది. ఈ నెగిటివిటీని పోగొట్టేందుకు సలార్ టీజర్ విడుదల చేశారని టాక్. ఇప్పుడు ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆదిపురుష్‌ను వదిలేసి సలార్‌పై ఫోకస్ పెడతారని ఇలా ప్లాన్ చేశారట.
ఇవీ చదవండి:
‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కి పూనకాలే.. ఆసక్తికర విషయం ఏంటంటే..
నిహారిక, చైతన్యలు విడిపోవడానికి కారణం ఏంటి? ఎవరు ముందుగా అప్లై చేశారంటే..
సినిమాలకు బ్రేక్.. నిర్మాతలు, ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సమంత
ఇదీ పవన్ కల్యాణ్ అంటే… 2 మిలియన్లకు చేరువలో ఇన్‌స్టా ఫాలోవర్లు