చంద్రబాబు ముడుపుల వ్యవహారంలో మరో సంచలనం!

చంద్రబాబు ముడుపుల వ్యవహారంలో మరో సంచలనం!

టీడీపీ అధినేత చంద్రబాబు రూ.118 కోట్ల ముడుపుల వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతోంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ. తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాళ్ళ మాదిరి… అంతర్జాతీయ మాఫియా డాన్లు తరహా… అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసే బ్రోకర్ల వలే .. చంద్రబాబు అండ్ గ్యాంగ్ కూడా ఈ ముడుపుల వ్యవహారంలో కోడ్ భాష వాడినట్టు తెలుస్తోంది. 8 వేల విలువైన కాంట్రాక్ట్ పనులు అప్పగించిన షాపూర్జీ-పల్లోంజీ, లార్సన్ అండ్ టూబ్రో సంస్థల నుంచి ముడుపులు రూపేణా చంద్రబాబు తన పీఏ పెండ్యాల శ్రీనివాస్ ద్వారా రూ. 118 కోట్లు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనే చంద్రబాబు అండ్ గ్యాంగ్ కోడ్ భాషను వాడింది.డబ్బును ఎక్కడెక్కడికి బదిలీ చేయాలి? ఎలా బదిలీ చేయాలి? వంటి అంశాల్లో ఈ కోడ్ భాషను వినియోగించినట్టు సమాచారం. 

విశాఖ అంటే విష్.. స్టీల్ అంటే..!

Advertisement

ఇక ఈ కోడ్ భాషను ఎలా వాడారంటే.. హైదరాబాద్‌లోని వారికి డబ్బు వేయాలంటే HYD అని.. విజయవాడలోని తమ అనుయాయులకు పంపాలి అంటే విజయ్ అని, విశాఖలోని వారికి పంపాలి అంటే విష్ అని, బెంగళూరు వారికి ఐతే బాంగ్ అని పేర్కొన్నారు. వీరి మధ్య వాట్సాప్ చాట్ సంభాషణ మొత్తం ఇలాగే నడిచింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎక్కడా డబ్బుకు సంబంధించి క్యాష్ అనే పదం వాడలేదు. స్టీల్ అని మాత్రమే పేర్కొన్నారు. స్టీల్ అంటే డబ్బు అని.. చెబుతూ దాన్ని టన్నుల్లో పేర్కొన్నారు. టన్ను అంటే కోటి అనే అర్థం వచ్చేలా వారిమధ్య కోడ్ భాషను ఏర్పాటు చేసుకుని టన్నుల్లో కోట్లను కొట్టేశారు. సదరు కాంట్రాక్ట్ కంపెనీలకు కన్సల్టెంట్‌గా పని చేస్తున్న మనోజ్ వాసుదేవ్ పార్థసానికి చంద్రబాబు పీఏకు మధ్య నడిచిన చాట్ సంభాషణ, డబ్బుల చెల్లింపులకు సంబంధించిన ఎక్సెల్ షీట్ తదితర ఆధారాలను సైతం ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

చంద్రబాబు లేఖకు స్ట్రాంగ్ కౌంటర్..!

చంద్రబాబు సదరు సంస్థలనుంచి ముడుపులు తిన్న వ్యవహారాన్ని ఐటీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆ తరువాత చంద్రబాబుకు ఐటి అధికారులు నోటీసులు ఇవ్వగా దానికి అయన సమాధానం ఇవ్వకపోగా ఎదురు రుబాబు చేసినట్టు సమాచారం. మీ అధికార పరిధి ఏమిటో తెలుసుకోండని.. తనకు నోటీసులు ఇచ్చే అధికారం హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ కు లేదని, సెంట్రల్ కార్యాలయానికి ఏ కేసును బదిలీ చేయకుండానే తనకు నోటీసులు ఇచ్చారని అంటూ ఎదురుదాడి చేశారు. ఈ మేరకు అయన 2022 అక్టోబర్ 10, 27న… 2023, జనవరి 31, జూన్ 20 తేదీల్లో ఆదాయపుపన్ను శాఖవారికి లేఖలు రాశారు. అయితే చంద్రబాబు లేఖకు అధికారుల నుంచి కూడా అంతే స్ట్రాంగ్ గా సమాధానం వచ్చింది. తమ నియమ, నిబంధనలు తమకు తెలుసని.. ముందు మీరు తిన్న డబ్బుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ దాదాపు 46 పేజీల నోటీసులు పంపారు. దీంతొ ఏమి చేయాలో తెలియక ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారు.