చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ హైడ్రామా అందుకేనా?

చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ హైడ్రామా అందుకేనా?

నిన్నటి నుంచి మొదలు టీడీపీ నేతలు, పార్టీ అధినేత కుటుంబం కొత్త పల్లవి అందుకుంది. చంద్రబాబు ప్రాణానికి హాని ఉందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తోంది. ఆయనకు అయ్యింది దద్దుర్లు మాత్రమే. కేవలం స్కిన్ అలర్జీ. దానికే ప్రాణాలు పోతాయా? అసలు టీడీపీ ఇంత హైడ్రామా చేయడానికి కారణం లేకపోలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో న్యాయవ్యవస్థపై ఒత్తిడి పెంచేందుకు ఈ సరికొత్త డ్రామాలకు టీడీపీ తెరదీసింది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచే టీడీపీ, చంద్రబాబు కుటుంబ సభ్యులు గేమ్‌ మొదలుపెట్టారు.

చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ హైడ్రామా అందుకేనా?

అలర్జీగా ఉందని చంద్రబాబు చెబితే రాజమండ్రి జైలు అధికారులు వెంటనే స్పెషలిస్టులను పిలిచి వైద్యం చేయించారు. చంద్రబాబు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని హెల్త్‌ బులెటిన్‌లో సైతం వైద్యులు వెల్లడించారు. విషయం చాలా సింపుల్. ఈ ఉదయం టీడీపీ నాయకులు, ఆయన కుటుంబం మరో డ్రామాకు తెరదీసింది. 5 కేజీల బరువు తగ్గారని, కిడ్నీలకు ప్రమాదమంటూ ప్రచారం నిర్వహిస్తోంది. జైలు నుంచి చంద్రబాబును తీసుకొచ్చేందుకు తప్పుడు ప్రచారానికి సైతం ఏమాత్రం వెనుకాడటం లేదు. ఎండలైనా, ఉక్కపోతైనా జైలైనా, ఇంట్లో అయినా ఒక్కటే కదా? దానికి ఇంత హైడ్రామా ఎందుకు?

Advertisement
చంద్రబాబుకు ఆరోగ్య సమస్యల పేరిట టీడీపీ హైడ్రామా అందుకేనా?

‘‘కేవలం వాతారణం ఆధారంగా బెయిల్‌ ఇస్తే.. దేశంలో ఎంతమంది ఖైదీలకు ఇవ్వాలి.? చట్టం ఒక్కొక్కరికీ, ఒక్కోరీతిలో ఉంటుందా.? చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారా.? లేదా.? అన్నది చెప్పేది వైద్య నిపుణులా ? టీడీపీ నాయకులా..? తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎలా చెప్పగలుగుతారు.? మొన్ననే నా భర్త ఆరోగ్యం ఉన్నారని.? ధైర్యంగా పోరాడమన్నారని ఆమే కదా అన్నారు.? చాలా గట్టిగా ఉన్నారని మొన్ననే కదా అన్నారు.? ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తారు కదా.? దేశంలో కోట్లాదిమంది అదే పద్ధతిలో తాగునీరు సరఫరా అవుతుంది కదా.? రాజమండ్రి జైలులో ఆ పద్ధతిలో తాగునీరు సరఫరా అయితే… అనారోగ్యం వచ్చేస్తుందా.? ఒకేసారి ఈ ఎత్తుగడలు ఎందుకు.? తప్పుడు ప్రచారాలు ఎందుకు.? చట్టం నుంచి తప్పించుకోవడానికే కదా..?’’ అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి.