పెత్తందారులపై పేదల విజయమిది.. న్యాయస్థానం ముందు మోకరిల్లిన మోసగాళ్లు …
బాబు వస్తే జాబు వస్తుంద.. కంపెనీలు.. పరిశ్రమలు వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆంధ్రాకు క్యూ కడnlr.. ఎవరూ ఏపీని వీడాల్సిన అవసరం ఉండదని.. దీనికోసం మీకు స్కిల్స్ (నైపుణ్యాలు ) లేకపోయినా ఫర్లేదు.. ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తుందని చెబితే నమ్మి పేద ప్రజలు ఓటేశారు. తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి.. తమ జీవితాలు మెరుగుపడుతాయని పేదలు ఆశించారు. అందుకే చంద్రబాబును 210లో విజయం దిశగా నడిపించారు. ఇక ఎన్నికల్లో గెలిచాక సీన్ మారిపోయింది. అంతవరకూ ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా మారింది పరిస్థితి. టీడీపీ పాలకులు తమ సొంత లాభం చూసుకున్నారు. యువతకు జాబ్ అన్నందుకో ఏమో కానీ యువకుడైన లోకేష్ ఒక్కడికీ మూడు శాఖలకు మంత్రిగా జాబ్ ఇచ్చేశారు .
ఉద్యోగాలు బులెట్ రైళ్ల మాదిరి ఎదురొస్తాయంటే..
మరి రాష్ట్రంలోని యూత్ పరిస్థితి ఏంటి? తమకు చిన్నవో పెద్దవో ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యూత్‌కు నిరాశే మిగిలింది. ఇదిగో మీకోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టా కాబట్టి ఇక మీ నైపుణ్యాలు రాకెట్లా దూసుకెళ్తాయని టీడీపీ ప్రభుత్వం నమ్మబలికింది. ఉద్యోగాలు బులెట్ రైళ్ల మాదిరి ఎదురొస్తాయంటే పాపం యువత అలాగే కళ్ళలో వత్తులు వేసుకుని ఉన్నారు. మీ నమ్మకమే మా పెట్టుబడి అన్నట్లు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పేరిట ఎడాపెడా వందలకోట్లు మింగేశారు. రూ. మొత్తం 371 కోట్లను ఆ పథకానికి విడుదల చేసి డమ్మీ కంపెనీల పేరిట రూ. 241 కోట్లు మళ్ళీ చంద్రబాబు జేబుల్లోకి వచ్చేశాయి. ఇక అంతా గప్ చుప్. ఆ తరువాత జనం కూడా తమ కష్టాలు.. బాధలు కుటుంబ సమస్యల్లో పడి దీన్ని మర్చిపోయారు కానీ కాలానికి జ్ఞాపకశక్తి ఎక్కువ న్యాయానికి ఓపిక ఎక్కువ.. అవి మాత్రం టీడీపీ అధినేతను వదల్లేదు.
ప్రతిపేజీలోనూ అవినీతి కొట్టొచ్చినట్లుగా..
పేదలను మోసం చేసి పబ్బం గడుపుకున్న పెత్తందారుల తరఫున పోరాడేందుకు 2019లో సీఎం అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుం బిగించారు. ఎక్కడెక్కడ ఎంతెంత దోపిడీ జరిగిందన్నది తవ్వి తీశారు. తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఏ పథకం చూసినా వందలకోట్ల అవినీతి. ఇదుగో మీ పేరిట ఇంత మోసం జరిగింది. ఇలాంటి పథకాల పేరిట దోచుకున్నది వేలకోట్లలో ఉంది. ఇది చిన్న శాంపిల్ అంటూ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని ప్రజల ముందు పెట్టారు. కానీ నేరగాళ్ళను శిక్షించాలంటే ప్రజా కోర్టు ఒక్కటే సరిపోదు. ధర్మదేవత సాక్షిగా పనిచేసే న్యాయస్థానం ఉండాలి. అందుకే పూర్తి ఆధారాలను న్యాయస్థానం ముందు పెట్టి ధర్మాధర్మాలను మీరే నిర్ణయించండి అని ప్రభుత్వం తరఫున న్యాయాన్ని అర్థించారు. ప్రతిపేజీలోనూ అవినీతి కొట్టొచ్చినట్లు స్పష్టమైంది. ఎక్కడా తప్పించుకునేందుకు వీలు లేదు. నాటి సీఎం చంద్రబాబు చెప్పారు రూల్స్ లేవు.. గీల్స్ లేవు.. డబ్బు ఇచ్చేయండి అంటూ అప్పటి ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రాసిన నోట్ ఫైల్స్ చూసి న్యాయ నిపుణులే నోరెళ్లబెట్టారు. ఓ ఇన్నాళ్లూ నిప్పును.. నిప్పును.. నన్ను ఎవరూ టచ్ చేయలేరు.. ఇకముందు కూడా ఎవరి తరమూ కాదంటూ విర్రవీగిన చంద్రబాబు కోర్టులో అడ్డంగా దొరికిపోయారు. పేదల పక్షాన పోరాడిన ప్రభుత్వం తమను మోసం చేసిన గత పాలకుడిని న్యాయస్థానం ఎదుట దోషిగా నిలబెట్టింది.
రాజకీయ కక్షలకు కోర్టులెందుకు వేదికలుగా మారతాయి?
ప్రభుత్వం కక్షగట్టి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిందంటూ కొందరు వీరాభిమానులు అక్కడక్కడా నిరసనలకు దిగారు కానీ అది రాజకీయ కక్ష కాదు.. తన అధికార సమయంలో చేసిన తప్పులకు శిక్ష అని ప్రభుత్వంతోబాటు న్యాయవ్యవస్థ చెబుతోంది. రాజకీయపరమైన వైరాలు ఉన్నంతమాత్రాన కోర్టులకు ఎందుకు కక్ష ఉంటుంది? రాజకీయ కక్షలకు కోర్టులు ఎందుకు వేదికలుగా మారతాయి? కేసుల్లో స్పష్టమైన ఆధారాలను , పత్రాలనూ తమముందు సమర్పించిన తరుణంలో కోర్టు వాటిని సంపూర్ణంగా పరిశీలించి ఎక్కడ ఏయే స్థాయిల్లో అవినీతి జరిగిందో స్పష్టతకు వచ్చాక తీర్పు చెప్పింది. ఇది పేదల విజయం.. తమను మోసం చేసిన పెత్తందారులను ఓడించేందుకు పేదల పక్షాన పోరాడుతూ సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం సాధించిన విజయం. అన్ని రోజుల్లోనూ అందర్నీ మోసం చేయడం కుదరదు.. ఏదోరోజు కాలం ఎదురుతిరిగితే మీ పాత తప్పులను సైతం ఎత్తి చూపడంతోబాటు ఎత్తి జైల్లో కుదేస్తుందన్నది గతంలో ఎంతోమంది నేరస్తులకు అనుభవమైంది. ఇప్పుడు చంద్రబాబుకు సైతం అదే సత్యం సాక్షాత్కరించింది.