కేసీఆర్ ఏం చేశారనే వారికి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్..

కేసీఆర్ ఏం చేశారనే వారికి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్..

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల దాడికి అంతమనేదే లేకుండా పోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకుంటూనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. దీంతో ఈ విమర్శలకు మరింత పదును పెరిగింది. కనీసం పార్లమెంటు ఎన్నికల్లో అయినా ఒక మంచి ఫిగర్‌ను దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది.

ఈ క్రమంలోనే నిన్న మొన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న గులాబీ బాస్ తిరిగి యాక్టివ్ అయ్యారు. ఆదివారం మూడు జిల్లాలో పర్యటించి ఎండిన పంటను కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడతూ.. కాంగ్రెస్ వంద రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్‌ రైతులకు.. రాష్ట్రానికి ఏం చేశారంటూ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్న వారికి ట్విటర్ వేదికగా కేటీఆర్ బదులిచ్చారు. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందని.. రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. దీనికంతటికీ కేసీఆరే కారణమన్నారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం అని ట్వీట్ చేశారు. దీనికి ఓ ఫోటోను కూడా కేటీఆర్ యాడ్ చేశారు. ఆయా రాష్ట్రాల పర్ క్యాపిటాకు సంబంధించిన ఫోటోను కేటీఆర్ జత చేశారు.