పెద్ద ఎత్తున అభ్యర్థనలు… గంటలో జగనన్న హామీ పరిష్కారం..

పెద్ద ఎత్తున అభ్యర్థనలు... గంటలో జగనన్న హామీ పరిష్కారం..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట తప్పను.. మడమ తిప్పనని ఎప్పుడూ చెబుతుంటారు. వాస్తవానికి ఆయన చెప్పింది చేస్తుంటారు. ఏదైనా అనుకుంటే ముందూ వెనుకా చూడరు. మొండిగా ముందుకు వెళుతుంటారు. ఆ తత్వమే ఆయనకు జనంలో పెద్ద ఎత్తున అభిమానాన్ని పెంచింది. మాట ఇచ్చారంటే చేసి చూపిస్తారు. ఇటీవలి కాలంలో జగన్ నిత్యం జనంలో ఉండేలా తన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు జిల్లా పర్యటనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తున్నాయి. వాటికి కేవలం గంటలోనే పరిష్కార మార్గం చూపిస్తున్నారు.

జగన్ శుక్రవారం భీమవరం పర్యటన సందర్భంగా పలువురి సమస్యలను వినడంతో పాటు తక్షణం వారిని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతిని ఆదేశించారు. జగన్‌కు అర్జీలిచ్చిన తొమ్మిది మందికి ఆ వెంటనే స్థానిక ఆర్డీవోకార్యాలయంలో ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున తొమ్మిది లక్షల రూపాయల చెక్కులను జాయింట్ కలెక్టర్ ఎస్. రామ సుందర్ రెడ్డితో కలిసి ప్రశాంతి అందజేశారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఈ కారణంగానే చెక్కులను అందజేయడం జరిగిందని ప్రశాంతి వెల్లడించారు.

చెక్కులు అందుకున్న వారి వివరాలు..

1. కడలి నాగలక్ష్మి, తండ్రి కడలి సత్యనారాయణ, ఎల్ బి చర్ల గ్రామం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.  భూ పరిష్కారంలో పరిహారం అందజేశారు.

2. ఎల్లమల్లి అన్నపూర్ణ, 29వ వార్డు, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. భర్త చనిపోయారు. ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

3. చిల్లి సుమతి, బోడ్డి పట్ల గ్రామం, ఎలమంచిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా,.. బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆర్థిక సహాయం అందజేశారు.

4. కంతేటి దుర్గ భవాని, వైఫ్ ఆఫ్ నాగ వెంకట రవితేజ, శ్రీరామవరం, దెందులూరు మండలం, ఏలూరు జిల్లా.  వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.

5. తేతలి గీత, వైఫ్/ఆఫ్ లేట్ టి ఎస్ ఎస్ ఎన్ రెడ్డి, ఫైర్ స్టేషన్ సెంటర్, ఏలూరు, ఏలూరు జిల్లా.. భర్త మరణించడం వల్ల ఆర్థిక సహాయం అందజేశారు.

6. అరుగుల లాజరస్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా  కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.

7. అందుగుల లాజర్, పూళ్ళ గ్రామం, భీమడోలు మండలం, ఏలూరు జిల్లా  కుమారునికి వైద్య సహాయం నిమిత్తం ఆర్థిక సాయం చేశారు.

8. గుడాల అపర్ణ జ్యోతి, తిరుపతి పురం, అత్తిలి, పశ్చిమగోదావరి జిల్లా. వైద్య సహాయం నిమిత్తం అందజేశారు.

9. కోరాడ వీర వెంకట సత్యనారాయణ, పొలసానపల్లి గ్రామం, భీమడోలు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.. వైద్య ఖర్చులు నిమిత్తం సహాయం అందజేశారు.

పెద్ద ఎత్తున అభ్యర్థనలు... గంటలో జగనన్న హామీ పరిష్కారం..