టెస్లా అధినేతతో చంద్రబాబు.. టీడీపీ దిగజారుతనానికి ఇదో నిదర్శనం..

టెస్లా అధినేతతో చంద్రబాబు.. టీడీపీ దిగజారుతనానికి ఇదో నిదర్శనం.. 

ఏపీలో ఎన్నికలకు సమయం పెద్దగా లేదు. ఎలాగైనా గెలవాలనేదే పార్టీల అంతిమ లక్ష్యం. దాని కోసం పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి. ఇక విపక్ష టీడీపీ అయితే బీభత్సంగా బుర్రకు పదును పెట్టి మరీ ఈసారి అధికారాన్ని దక్కించుకోవాలని స్కెచ్‌ల మీద స్కెచ్‌లు గీస్తోంది. అలు సోషల్ మీడియా.. ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాను వాడేసి ఎడా పెడా తమ పార్టీ అనుకూల వార్తలు.. అధికార వైసీపీకి ప్రతికూల వార్తలు గుమ్మరించేస్తోంది.

తిమ్మిని బమ్మిని చేయడం.. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు కనికట్టు చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటే. ఎన్నికల ప్రచారంలో భాగంగా మార్ఫింగ్ ఫోటోలను సైతం తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి జనాల పైకి వదులుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటోను టీడీపీ విడుదల చేసింది. నిజానికి ఆ ఫోటో టీడీపీ ఖాతాల్లో తప్ప ఇంటర్ నెట్‌లో ఎక్కడా కూడా భూతద్దంతో వెదికినా కనిపించడం లేదు.ఇంతకీ ఏంటా ఫోటో అంటారా? 

చంద్రబాబు టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌ను కలిసినట్టుగా ఉన్న ఫోటో ఒకటి టీడీపీ సోషల్ మీడియా ఖాతాల్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటో నిజమే అయితే అన్ని ఇంటర్ నెట్‌లో ట్రెండింగ్‌లో ఉండాలి కానీ టీడీపీ ఖాతాల్లో తప్ప ఎక్కడా కనిపించడమే లేదు. కొంచెం ఆరా తీస్తే ఇది మార్ఫింగ్ పిక్ అని తెలిసింది. చంద్రబాబు పక్కన ఎలాన్ మస్క్ ఫోటోను అతికించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా ఖాతాలోకి వదిలారు. ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్న అవకాశాన్ని వాడుకునేందుకు టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉంటుందా? అని నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.