ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు.. చంద్రబాబుపై పెన్షనర్ల మండిపాటు

ఫస్టొచ్చింది… పెన్షన్ రాలేదు.. చంద్రబాబుపై పెన్షనర్ల మండిపాటు

ప్రతినెలా ఫస్ట్ తేదీ రాగానే పెన్షనర్లకు ఎదురు చూపు కూడా అవసరం లేకుండా ఇంటి ముందు క్షేమ సమాచారాలతో వలంటీర్ వాలిపోతాడు. కరెన్సీ నోట్లు చేతిలో పెట్టి ఆప్యాయంగా పలకరించి వెళ్లిపోతాడు. వలంటీర్ వెళ్లగానే ఆ డబ్బుతో ఇంట్లో నిత్యావసరాలు, మందులు కొనుక్కుంటూ ఉంటారు. కానీ ఈ నెల ఫస్ట్ వచ్చింది. అవ్వా తాతల ఎదురు చూపులు తప్ప వలంటీర్ రాలేదు. చేతిలో పైసా కూడా పడలేదు. ఎండలో పడి ఆటోనో.. బస్కో ఎక్కి పక్కూరుకు వెళ్లి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలి.

వృద్ధులు, వికలాంగులకు ఇది అయ్యే పనేనా? ఎండలు మండిపోతుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన ఎత్తులు, కుట్రలవల్ల వృద్ధులు, వికలాంగులు నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకులకు ఈ మండుటెండలో వెళ్లడమే కష్టమంటే.. అక్కడకు వెళ్లి క్యూలైన్‌లో నిలబడి.. ఫారం నింపి డబ్బులు తీసుకోవడం వారికి చాలా కష్టం. ఇంతా చేసికొన్ని బ్యాంకులు తమ ఖాతాల్లో కనీస నిల్వ (మినిమమ్ బ్యాలెన్స్ ) లేకపోతే కొంత పెనాల్టీ విధిస్తాయి.

Chandrababu naidu

ఇది గోటిచుట్టుపై రోకటిపోటు మాదిరి అవుతుంది. పేదల ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉండటమనేది చాలా కష్టం. అలా వాళ్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్‌టైన్ చేయకుంటే పాపం వీళ్ళ ఖాతాల్లోకి వచ్చిన మూడు వేలలో కొంత కోత పడుతుంది. అది తమకు మరింత నష్టమని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదంతా చంద్రబాబు చేసిన కుట్ర అని, వలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్లు పంచడాన్ని అయన భరించలేక… సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మంచిపేరు రావడాన్ని సహించలేక ఇలాంటి కుట్రలకు దిగారని, రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని పెన్షనర్లు అంటున్నారు.