కేసీఆర్ గురించి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

కేసీఆర్ గురించి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ గురించి వ్యాఖ్యానించారు. గత పదళ్లలో కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ అండగా నిలిచిందని రేవంత్ విమర్శించారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. కాగా.. గతంలోనూ బీజేపీ విషయంలో బీఆర్ఎస్ పెద్దగా స్పందించేది కాదు.

బీజేపీ ఏం చేసినా సైలెంట్‌గానే ఉండిపోయేది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆమె మూడు సార్లు విచారణకు హాజరైనా కూడా అరెస్ట్ చేయలేదు. దీంతో బీజేపీతో బీఆర్ఎస్ లాలూచీ పడిందంటూ ప్రచారం అప్పట్లో బీభత్సంగా జరిగింది. ఆ సమయంలో తమ కుమారుడు కేటీఆర్‌ను సీఎంని చేయాలని భావిస్తున్నానని.. దీనికి కేసీఆర్ తన మద్దతు కోరినట్టు ప్రధాని మోదీ తెలంగాణలో నిర్వహించిన ఓ సభలో వెల్లడించారు.

ఈ విషయాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. కేసీఆర్ అన్నీ బయటకు చెప్పరని.. కొన్ని మాత్రమే చెప్పి.. కొన్ని దాస్తారని ఎద్దేవా చేశారు. దీనికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. మీరిచ్చిన హామీలన మీకు గుర్తు చేస్తున్నామన్నారు. తమకు బీజేపీతో ఎలాంటి సంబంధమూ లేదని తెలిపారు. ముఖ్యమంత్రిని మార్చాలంటే తాము ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.