ఒకవైపు సొంత పార్టీ నేతలే టీడీపీ అధినేత చంద్రబాబుపై తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి మరీ అధినేతను ఏకి పారేస్తున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు పార్టీకి చేటు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే ఆత్మీయ సమావేశాల్లో టీడీపీ, జనసేన నేతలు, కేడర్ మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఇప్పుడు జనసేన కేడర్ చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదు. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చూస్తే చంద్రబాబుతో అంటకాగుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కేడర్‌ది. 2014 ఎన్నికల్లో జనసేనను తమ అవసరానికి వాడుకుని ఆపై కరివేపాకులా తీసేసిన సంగతిని కేడర్ మర్చిపోలేదు.
కేడర్ ఒప్పుకునే పరిస్థితి లేదు..
తాజాగా పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు తామంతా కలిసే ఉన్నామనే సంకేతాలు అయితే ఇచ్చారు. దీన్ని ఎల్లో మీడియా ఓ రేంజ్‌లో కవర్ చేసింది. ఈ భేటీలో సీట్ల పంపకంపై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఈ భేటీలో పవన్ డిమాండ్స్ కాస్త గట్టిగానే ఉన్నట్టు సమాచారం. 50 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేశారని టాక్. కానీ చంద్రబాబు 30 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్థానాలకు ఓకే చెప్పారట. జనసేన కేడర్ మాత్రం దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. వారాహి యాత్ర తర్వాత జనసేన గ్రాఫ్ 25-30 శాతానికి పెరిగిపోయిందని కేడర్ భావిస్తోంది. అయితే ఇదంతా వాపును చూసి బలుపు అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికల్లోనూ పవన్ సభలకు జనం పోటెత్తారు కానీ అక్కడ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇదే సీన్ ఏపీలోనూ రిపీట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అవమానంగా భావిస్తున్నారట..
ఈ భ్రమలోనే కేవలం 30 సీట్లు అయితే టీడీపీతో పొత్తు వద్దని జనసేన అధినేతకు కేడర్ తెగేసి చెప్పారని సమాచారం. అంతేకాకుండా చంద్రబాబు ఇచ్చిన సీట్లలో కూడా కొన్ని సీట్లు జనసేన మ్యాండెట్ పై తమ అభ్యర్ధులనే నిలబెడతారని జనసేనలో క్యాడర్ ఒపెన్ గానే డిస్కస్ చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఎన్నికల వరకూ పొత్తు నిలవడం కష్టమేనని అనిపిస్తోంది.కాపులను మోసగించిన చంద్రబాబును నమ్మలేమని బాహాటంగానే జనసేన నేతలు చెబుతున్నారు. తమ అధినేత విషయంలో కూడా కేడర్ గుర్రుగానే ఉంది. పవన్‌పై అభిమానంతో సొంత డబ్బు ఖర్చు పెడుతుంటే టీడీపీతో పొత్తు ఇస్టం లేకుంటే వైసీపీలోకి వెళ్లమని సూచించడం వారు అవమానంగా భావిస్తున్నారు. తమ నాయుకుడి వ్యాఖ్యలతో పార్టీలోనే సైలెంట్‌గా ఉండిపోవడం బెటరని ఓ వర్గం భావిస్తోందట. మొత్తానికి ఈ ప్రకటనతో జనసేన నాయకుల్లో యాక్టివ్ నెస్ తగ్గడంతో పాటు పవన్ వైజాగ్ సభకు జనం కూడా అంతంత మాత్రంగానే హాజరయ్యారు.
Director Harish Shankar knows the importance of music in generating buzz, thus he has taken…
ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది హీరోయిన్ కీర్తిసురేష్. కొన్ని అంశాలపై ఆమె స్పందించిన తీరు వైరల్…
The Congress party is considering filing a privilege motion against Prime Minister Narendra Modi and…
బుల్లితెరపై సావిత్రి బాగా పాపులర్ అయ్యారు శివజ్యోతి. తెలంగాణ యాసలో వార్తలు చదివి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలో…
"కాంతార" సినిమాలో హీరోయిన్ గా నటించిన సప్తమి గౌడ గుర్తుందా? ఆ సినిమాలో గిరిజన ప్రాంతానికి చెందిన లేడి కానిస్టేబుల్…
ఈమధ్య కాస్టింగ్ కాల్ కల్చర్ బాగా పెరిగింది. పెద్ద సినిమాలు కూడా కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నాయి. మొన్నటికిమొన్న చరణ్ తో…