పీఏ ద్వారా రూ.118 కోట్లు నొక్కేసిన చంద్రబాబు.. ఐటీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు

పీఏ ద్వారా రూ.118 కోట్లు నొక్కేసిన చంద్రబాబు.. ఐటీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు

పతివ్రత పరమాన్నం వండితే తెల్లారే వరకూ చల్లారలేదట.. ప్రతిరోజూ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడి చనిపోయినట్టు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత వ్యవహారం ఉంది. నేతి బీరలో నెయ్యి ఎంత ఉంటుందో ఆయన మాటల్లో నిజాయితీ అంత ఉంటుందని మరోసారి తేటతెల్లమైంది. ప్రధాని మోదీ గతంలోనే ఏపీలో మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మాదిరి వాడుకుంటూ కమీషన్లు మింగుతున్నారని.. అదే మరోమారు రుజువైంది. చంద్రబాబు రూ.118 కోట్ల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేసినట్లు జాతీయ మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.

ఐటీ సంస్థల సోదాల్లో అసలు విషయం వెలుగులోకి..

Advertisement

చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయంలో చేసింది ఒక్కటేనని మనకు అవగతమవుతోంది. తనకు నచ్చిన వాళ్లకు.. అనుయాయులకు భారీగా రేట్లు పెంచి కాంట్రాక్టులు, పనులు ఇవ్వడం.. దానికి ప్రతిఫలంగా వారినుంచి వందలు.. వేల కోట్లలో కమీషన్లు నొక్కడం.. ఆయనకు తెలిసింది ఇదే. గతంలో అధికారంలో ఉన్నపుడు కూడా ఇలాగే జరిగింది. అమరావతి కాంట్రాక్టర్‌లు అయిన షాపూర్జి పల్లోంజి (ఎస్పీసీఎల్), ఎల్&టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో చంద్రబాబుకు రూ.118 కోట్ల ముడుపులు ముట్టాయి. ఈ విషయాలు ఐటి సంస్థల సోదాల్లో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ఇటీవల షాపూర్జి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో ఐటీ శాఖ జరిపిన తనిఖీల్లో సదరు కాంట్రాక్టర్ చంద్రబాబుకు డబ్బు ముట్టజెప్పినట్లు ఐటి శాఖ గుర్తించింది.   

పీఏ ద్వారా రూ.118 కోట్లు నొక్కేసిన చంద్రబాబు.. ఐటీ సోదాల్లో వెలుగులోకి సంచలన విషయాలు

కమీషన్ల కోసం పీఏను రంగంలోకి దింపిన చంద్రబాబు..

అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ని పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారని సమాచారం. చంద్రబాబు సూచన మేరకు ఆయన పీఏను మనోజ్ కలిశారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. ఈ సమయంలోనే చంద్రబాబు కమీషన్ల కోసం శ్రీనివాస్‌ను రంగంలోకి దింపారట. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్‌కి శ్రీనివాస్ అటాచ్ చేయడం జరిగింది. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని మనోజ్‌కు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ చెప్పారు. 

సెక్షన్ 153C కింద బాబుకు నోటీసులు..

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు ఐటీ అధికారులు ఆధారాలు సేకరించారు.ఇదంతా మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో బయటపడింది. ఈ విషయాన్ని మనోజ్ వాసుదేవ్ (ఎంవిపి) ఐటి అధికారుల ముందు కూడా అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఈ విషయంలో చంద్రబాబుకు సైతం ఆగస్ట్ 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. సంస్థల నుంచి వచ్చిన రూ.118 కోట్ల మొత్తాన్ని బహిర్గతం కాని ఆదాయంగా పరిగణించడం, చట్టం ప్రకారం ప్రాసెస్ చేయబడుతుందనే అంశాలను ఐటి శాఖ నోటీసుల్లో ప్రస్తావించింది. దీంతో తన బండారం బయటపడుతుందని భయపడిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకుని ఆ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.